Mango: రసాయనాలతో పండించిన మామిడిని ఎలా గుర్తించాలి?

ఇప్పుడు మార్కెట్‌లో లభించేవి కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లే. సహాజంగా పండిన పండ్లకు వీటికి చాలా తేడా ఉంటుంది. రంగు, రుచితోపాటుగా రసంలో గమినిస్తే మార్పులు కనిపిస్తాయి. కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లు తింటే దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయి.

New Update
mango

mango

Mango: వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లను తింటుంటాం. దీని రుచి, సువాసన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల తక్కువ సమయంలో ఎక్కువ లాభాల కోసం మామిడి పండ్లను కృత్రిమంగా పండించే పద్ధతులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ అనే హానికరమైన రసాయనాన్ని ఉపయోగించి మామిడిని పండిస్తున్నారు. దీని వల్ల అసిటలీన్ వాయువు విడుదలై పండు త్వరగా పండుతుంది. కానీ ఇది పండులో ఉన్న సహజ పోషకాలను నాశనం చేస్తుంది. ఇందులో ఉండే ఫాస్ఫరస్ హైడ్రైడ్, ఆర్సెనిక్ మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. 

మామిడి పండ్లకు సహజ సువాసన:

ఇవి శరీరంలోకి వెళ్ళినపుడు జీర్ణాశయ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, అలెర్జీలు, తలనొప్పులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సహజంగా పండిన మామిడి పండ్లకు సహజ సువాసన ఉంటుంది. ఇవి తియ్యగా ఉండి రుచిగా ఉంటాయి. అవి గట్టిగా ఉండి, పండినట్టు కనిపిస్తాయి. అలాగే రంగు ఒకేలా ఉండదు. పసుపు, ఆకుపచ్చ కలిపి ఉంటుంది. మరొకవైపు రసాయనాలతో పండించిన మామిడికి వాసన ఉండదు. అవి ఎక్కువగా మెత్తగా ఉంటాయి. పైకి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా రుచి, రసం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మామిడి మీద ఆకుపచ్చ మచ్చలు, ముడతలు కనిపించవచ్చు. మామిడిని ఒత్తినప్పుడు ఎక్కువగా నలిగిపోతే అది కృత్రిమంగా పండించినది. 

ఇది కూడా చదవండి: మానసిక స్థితిని మెరుగుపరిచే అద్భుతమైన ఆహారాలు

ఒక బకెట్‌లో నీళ్లు పోసి అందులో మామిడి పండ్లు వేసినపుడు సహజంగా పండినవి నీటిలో మునుగుతాయి. తేలిపోయే పండ్లు ఎక్కువగా గాలితో నింపబడి, రసాయనాలతో పండినవి అయ్యే అవకాశముంది. అలాగే మామిడిని కోసినపుడు లోపల రంగు పూర్తిగా పసుపుగా లేక ఒకేలా లేకపోతే అది రసాయనాలు కలిపిన పండు. ప్రస్తుతం మార్కెట్లలో ఎక్కువగా దొరుకుతున్న మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్ వాడకంతో పండినవే ఉంటున్నాయి. వాటిని తినడం వల్ల తక్షణమే సమస్యలు కనిపించకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. సాధ్యమైనంతవరకు రైతుల నుంచి లేదా గుర్తింపు పొందిన ఫార్మ్ ఉత్పత్తులు కొనాలి. ఇంట్లో సహజ పద్ధతుల్లో మామిడిని పండించాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

mango | mangoes-tips | health-tips | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు