Tanning: టానింగ్ తొలగించుకోవడానికి సులభమైన పరిష్కారం

వేసవిలో చేతులు, కాళ్లు, ముఖం ఎక్కువగా టాన్ అవుతాయి. ఇంట్లో శనగపిండి, ముల్తానీ మట్టి, పెరుగు, నిమ్మకాయ రాస్తే చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ నాలుగు పదార్థాలు టానింగ్‌తోపాటు చర్మంపై ఉన్న మచ్చలు, పొడితనం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update

Tanning: వేసవిలో టానింగ్ అనేది ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సాధారణ సమస్య. ఎండలో కొద్దిసేపు గడిపినా చర్మం తన సహజ రంగును కోల్పోయి గోధుమ రంగులోకి మారుతుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లు, ముఖం ఎక్కువగా టాన్ అవుతాయి. బయట పనులు ఉండటం వల్ల ఎండకు వెళ్లకుండా ఉండలేం. అయితే సహజ పదార్థాలతో తయారయ్యే ఈ బాడీ మాస్క్ టానింగ్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మాస్క్‌లో ఉండే శనగపిండి మృదువైన స్క్రబ్బర్ లాగా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది. 

టానింగ్, చర్మంపై మచ్చలు పరార్:

ముల్తానీ మట్టి చర్మాన్ని చల్లబరచడమే కాకుండా చర్మం నుండి అధిక తేమను తీసి దాని ఆకృతిని మెరుగుపరుస్తుంది. పెరుగు మృదుత్వాన్ని పెంచి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. నిమ్మకాయలోని విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే శక్తి కలిగి ఉంది. ఈ నాలుగు పదార్థాల సమ్మేళనం వల్ల టానింగ్ మాత్రమే కాక చర్మంపై ఉన్న మచ్చలు, పొడితనం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ మాస్క్ తయారీ చాలా సులభం. పై పదార్థాలను కలిపి గాఢంగా ఉండేలా పేస్ట్ చేసి శరీరంపై అప్లై చేయాలి. అప్లికేషన్ సమయంలో నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

ఇది కూడా చదవండి: శరీరంలో కనిపిస్తే ఈ లక్షణాలు ఉంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే

పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. సబ్బు వాడకపోవడం వల్ల చర్మం సహజ తేమ కోల్పోకుండా ఉంటుంది. మీరు ఈ మాస్క్‌ను రోజూ లేదా వారానికి మూడుసార్లు వాడవచ్చు. అయితే ఈ మాస్క్‌లో నిమ్మకాయ ఉండటం వల్ల కొంత మందికి చర్మ సమస్యలు వస్తాయి. అందుకే ముందుగా చేతిపై లేదా చెవి వెనుక ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఈ మాస్క్‌ను ముఖంపై కూడా వాడొచ్చు. అయితే కళ్లకు దగ్గరగా అప్లై చేయకుండా జాగ్రత్త వహించాలి. ఈ సహజ మాస్క్‌ను వేసవి స్కిన్‌కేర్ రొటీన్‌లో భాగంగా చేసుకుంటే టానింగ్ సమస్య తగ్గి ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రాత్రి పడుకునే ముందు జుట్టు దువ్వుకుంటే కలిగే ప్రయోజనాలు


( multani-mitti | card | lemon | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు