Home Tips: ఇంటిని అలంకరించే మొక్కల మధ్య దాగి ఉన్న ప్రమాదం

అందమైన పచ్చని మొక్కల కోసం స్నేక్‌రూట్, అకోనైట్, లాంటానా లాంటివి ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటివల్ల వికారం, వాంతులు, తలతిరుగుడు, కోలాహలం, కాలేయం, కడుపు నొప్పితోపాటు మరణం సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Poisonous plants

Poisonous plants

Home Tips: ఇంటిని అలంకరించడం అనేది కేవలం అందాన్ని పెంచే పనికే కాదు. అది మనసుకు శాంతి, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్రక్రియ కూడా. అందమైన పచ్చని మొక్కలు, రంగు రంగుల పూలు ఉన్న ఇంటి పరిసరాలు ఎంత శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయో అంతే మనసుకు హాయిగా ఉంటాయి. అందుకే చాలా మంది ఇంటి అలంకరణ కోసం రకరకాల మొక్కలను పెంచుతున్నారు. కానీ ఈ అందాల మధ్య కొన్ని ప్రమాదకరమైన మొక్కలు ఉంటాయని విషయం తెలియదు. కొన్ని మొక్కలు చూసేందుకు ఎంత అందంగా ఉన్నా అవి ఆరోగ్యానికి తీవ్రంగా హానికరంగా మారవచ్చు. అలాంటి మొక్కల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ప్రాణాంతకంగా మారే..

అలాంటి మొక్కల్లో తెల్లటి స్నేక్‌రూట్ ఒకటి. ఇది చిన్న తెల్లటి పువ్వులతో ఆకర్షణీయంగా కనిపించినా ఇది విషపూరిత ఆల్కహాలైన ట్రెమాటోల్‌ను కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరంలో విషం వ్యాపించి ప్రాణాపాయం ఏర్పడే అవకాశముంటుంది. అదే విధంగా డాతురా అనే పుష్పించే మొక్క విత్తనాలు, ఆకులు, పువ్వులన్నీ తీవ్రంగా విషపూరితమైనవే. ఇవి తింటే వికారం, వాంతులు, తలతిరుగుడు, కోలాహలం, చివరికి మరణం సంభవించవచ్చు. పిల్లలు, పెంపుడు జంతువులు వీటి పరిధిలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. అకోనైట్ అనే మరో మొక్కను విషపు రాజుగా పిలుస్తారు. ఈ మొక్కను తాకినంత మాత్రాన చర్మానికి మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ప్రాణాంతకంగా మారే అవకాశముంది. 

ఇది కూడా చదవండి: గుండె ఆరోగ్యం మీ ముఖం చెబుతుందా..? ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోండి

అలానే లాంటానా అనే రంగురంగుల పూల మొక్క గుబురుగా పెరుగుతుంది. ఇది అలంకరణకు అనుకూలంగా ఉన్నా, దీని ఆకులు, బెర్రీలలో ఉండే ట్రైటెర్పెనాయిడ్స్ అనే రసాయనాలు మానవ ఆరోగ్యానికి హానికరం. ఇవి మింగితే వాంతులు, విరేచనాలు, కాలేయం వంటి సమస్యలు వస్తాయి. ఇంకా రిసిన్ అనే విషాన్ని కలిగి ఉండే కొన్ని అడవి మొక్కలు విత్తనాలను తింటే కడుపు నొప్పి, వాంతులు, మరణం సంభవించవచ్చు. అందువల్ల ఇంట్లో, తోటలో ఏదైనా మొక్కను నాటే ముందు దాని లక్షణాలు, ప్రాణాంతకత గురించి తెలుసుకోవాలి. మొక్కలను జాగ్రత్తగా ఎంపిక చేసి తాకేటప్పుడు చేతి తొడుగులు ధరిస్తే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: డీప్ ఫ్రై చేసిన ఆహారం తక్కువ హానికరంగా ఉండాలంటే వీటి వాడకమే మంచిది

home-tips | home tips in telugu | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు