Deep Fry Oil: డీప్ ఫ్రై చేసిన ఆహారం తక్కువ హానికరంగా ఉండాలంటే వీటి వాడకమే మంచిది

డీప్ ఫ్రై కోసం కొబ్బరి, ఆలివ్, అవకాడో నూనె, దేశీ నెయ్యి వాడటం మంచిది. సీడ్, కనోలా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ లాంటి నూనెలను డీప్ ఫ్రైకి, ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె, జీవక్రియలపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update

Deep Fry Oil: భారతీయ ఆహార సంస్కృతిలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలు ముఖ్యమైన భాగం. పకోడీలు, పూరీలు, బాజీలు, వడలు లాంటి వంటకాలు ఎన్నో సందర్భాల్లో ప్రత్యేకతను చాటతాయి. అయితే తరచుగా డీప్ ఫ్రై చేసిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, ఇతర జీవక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేయలేనివారు తక్కువ హానికరం కలిగించే నూనెలను వాడటం మంచిది. నాలుగు రకాల వంట నూనెలు డీప్ ఫ్రై చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఆరోగ్యానికి మేలు:  

శుద్ధి చేసిన కొబ్బరి నూనె మంచి ఎంపిక. ఇందులో అధికంగా సంతృప్త కొవ్వులు, వేడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. పోషకాల పరంగా ఇది శుద్ధి చేయని కొబ్బరి నూనెతో సమానంగా ఉంటుంది. ఆలివ్ నూనె ఇది మోనోఅన్‌సాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డీప్ ఫ్రై చేయడానికి అనువైనదిగా ఉన్నా దీనిని ఎక్కువగా వేడి చేస్తే దీర్ఘకాలానికి హానికరంగా మారవచ్చు. కాబట్టి దానిని తినేలా ఉపయోగించడమే మంచిది. దేశీ నెయ్యి వేయించడానికి ఉత్తమ ఎంపిక. దీనిలోని కొవ్వులు సహజంగా ఉండటంతో శరీరానికి తక్కువ హాని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో దేశీ నెయ్యి సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: ముఖం ఫిట్‌గా, యవ్వనంగా కావలా..? అయితే ఈ మూడు వ్యాయామాలు ట్రై చేయండి

అవకాడో నూనెను వేయించడానికి మంచి ఎంపికగా చెబుతారు. ఇది దీర్ఘకాలపు వేడిని తట్టుకోగలదు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. సీడ్, కనోలా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ లాంటి నూనెలను డీప్ ఫ్రై చేయడానికి ఉపయోగించడం మంచిది కాదు. వీటిలో ఎక్కువగా ప్రాసెస్ చేసిన కొవ్వులు ఉండటంతో ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందువల్ల వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేయలేకపోయినా.. సరైన నూనె ఎంపిక ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి?

( home-tips | home tips in telugu | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )

Advertisment
తాజా కథనాలు