Foot Pain: ఈ తైలం రాయండి పాదాల నొప్పి నుంచి వారంలోగా ఉపశమనం పొందండి

పాదాల నొప్పులు, వాపులకు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. పాదాల నొప్పికి వెల్లుల్లి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వాపు, నొప్పి రెండింటినీ తగ్గిస్తుంది. ఈ నూను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Foot Pain

Foot Pain

పాదాలు మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. రోజంతా నడవడం, పరుగెత్తడం, ఇంట్లో లేదా ఆఫీసులో పనులు చేయడం, ఇలా ప్రతి పనిలోనూ పాదాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల తరచూ రోజు చివర్లో పాదాలలో నొప్పి లేదా వాపు రావడం సాధారణం. కొన్నిసార్లు ఈ నొప్పి వల్ల రాత్రిపూట నిద్ర కూడా సరిగా పట్టదు. ఇటువంటి సమయాల్లో మందులపై ఆధారపడటం కంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల త్వరిత ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పాదాల నొప్పులు, వాపులకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఏ నూనెలతో ఉపశమనం పొందుతారో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పాదాల నొప్పులకు నూనెలతో ఉపశమనం:

డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. పాదాల నొప్పికి వెల్లుల్లి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వాపు, నొప్పి రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. 10 వెల్లుల్లి రెబ్బలను నలగకొట్టి.. వాటిని ఆవాలు లేదా కొబ్బరి నూనెలో వేయాలి. ఈ మిశ్రమాన్ని వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంటపై వేడి చేయాలి. తరువాత చల్లారాక వడగట్టి నిల్వ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను పాదాలపై 10 నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి. క్రమం తప్పకుండా ఒక వారం రోజులపాటు ఈ పద్ధతిని పాటిస్తే పాదాల వాపు, నొప్పి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలకు గుండె పోటు.. ఎందుకో తెలుసా..?

ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, కండరాల బిగుతును తగ్గిస్తుంది. ఎక్కువసేపు నిలబడటం వల్ల పాదాలలో బరువు, అలసట ఉన్నవారికి ఆవాల నూనె మర్దన చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా చేయడంతోపాటు పాదాలలోని నరాలు, కండరాలకు కూడా విశ్రాంతినిస్తుంది. పాదాలలో మంటగా అనిపించినా లేదా బాగా అలసటగా ఉన్నా కొద్దిగా గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  అంతేకాకుండా లావెండర్ ఆయిల్ పాదాల నొప్పితో పాటు నిద్ర సమస్యలు ఉన్నవారికి ఉత్తమమైనది. ఇది పాదాలకు ఉపశమనం ఇవ్వడమే కాకుండా మనసుకు ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. దీన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలిపి ఉపయోగించవచ్చు. ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పాదాల వాపు, బిగుతును తగ్గిస్తాయి. తరచూ చీలమండల నొప్పితో బాధపడేవారికి ఈ నూనె ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నడవడంలో ఈ పొరపాట్లు చేయకండి.. లేదంటే నడిచి ప్రయోజనం ఉండదు

Advertisment
తాజా కథనాలు