Vegetables: ఈ కూరగాయలను మూతపెట్టి ఉడికించోదా..? రుచితోపాటు ఆరోగ్యానికి హానని తెలుసా..!!

కొన్ని కూరగాయలను మూతపెట్టి ఉడికించకూడదు. వాటిల్లో కాలీఫ్లవర్‌, పొట్లకాయ, భిండి, వంకాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, పాలకూర, ఆకుకూరలను మూత పెట్టి ఉడకించటం వల్ల వాటి రుచిని తగ్గించడమే కాకుండా వాటి పోషకాలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Vegetables

Vegetables

Vegetables: నేటి జిబి జీవితంలో ఏ పని చేయాలన్న సమయం తక్కువ. ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్లే వారు అన్ని పనులు చేసుకుని వెళ్లలేరు. ఇక వంట విషయానికి వస్తే అమ్మ బాబోయ్ అని పారిపోతారు. కానీ కొంత మంది ఆరోగ్యం కోసం ఇంటి ఆహారాలను ఇష్ట పుడతారు. మరి కొందరూ అయితే ఎప్పుడు చూసిన బయటనే తింటారు. అయితే.. వంట చేసే పని చాలా తగ్గుతుందని చాలామంది ఎక్కువగా వంట చేసి వాటిని రెండు, మూడు రోజులు నిల్వ పెట్టుకుని తింటారు. ఆహారంలో ఏదో ఒక కూరగాయలు ఉంటాయి. అవి రుచితోపాటు ఆరోగ్యకరమైనవి. అయితే కూరగాయలు వండేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తారు. వాటివాళ్ల ప్రయోజనాలు, రుచి తగ్గుతుంది. కూరగాయలను మూతపెట్టి ఉడికించడం అలాంటి వాటిల్లో ఒక తప్పు.  కొన్ని కూరగాయలను మూతపెట్టి ఉడికించకూడదు. ఇది వాటి రుచిని తగ్గించడమే కాకుండా వాటి పోషకాలను కూడా తగ్గిస్తుంది. ఆ కూరగాయాలు ఎటో ఈ ఆర్టికల్‌ కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మూతపెట్టి ఉడికించని కూరగాయలు: 

  • కాలీఫ్లవర్‌ మూత లేకుండా ఉడికించాలి. కాలీఫ్లవర్‌లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు మూతపెట్టి ఉడికించడం ద్వారా తగ్గుతాయి. ఎక్కువగా ఉడికించడం వల్ల కూరగాయకు వింత వాసన వచ్చి రుచి చెడిపోవచ్చు.
  • పొట్లకాయలో నీటితో నిండి ఉంటుంది. దానిని మూతపెట్టి ఉడికించడం వల్ల దాని నిర్మాణం మరింత తడిగా, రుచి లేకుండా ఉంటుంది. మూతపెట్టి అధిక మంట మీద ఉడికించడం వల్ల పొట్లకాయలో ఉన్న గ్లూకోజ్, ఫైబర్ విచ్ఛిన్నమై పొట్లకాయ గ్లైసెమిక్ సూచికను పెంచుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు.
  • భిండి సబ్జీని ఎప్పుడూ మూతపెట్టి ఉడికించకూడదు. ఇలా చేస్తే భిండి జిగటగా, దాని ఆకృతి తడిగా మారుతుంది. భిండి అస్సలు రుచితోపాటు విటమిన్ సి తగ్గుతుంది. క్రిస్పీగా, రుచికరంగా, ఆరోగ్యంగా తినాలనుకుంటే దానిని మూత లేకుండా ఉడికించాలి.
  • వంకాయలో నీటి శాతం ఎక్కువ, చాలా మృదువుగా ఉంటుంది. దానిని మూతపెట్టి ఉడికించడం వల్ల దాని ఆకృతి, రుచి రెండూ చెడిపోతాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, నీరు తగ్గి జీర్ణం కావడం కష్టమవుతుంది. వంకాయను మూత పెట్టకుండా తక్కువ మంట మీద ఉడికించాలి.
  • క్యాబేజీ కూరగాయ తయారు చేస్తుంటే దానిని మూత పెట్టకుండా తేలికగా ఉడికించాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల క్యాబేజీ   క్రంచీనెస్ తొలగి..తడిగా మారుతుంది. అధిక ఆవిరి కారణంగా క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కె కూడా తగ్గుతుంది.
  • క్యాప్సికమ్ కరకరలాడే రుచిని నిలుపుకోవడానికి మూత లేకుండానే ఉడికించాలి. మూతపెట్టి ఉడికించడం వల్ల దాని రుచి, ఆకృతి చెడిపోయి విటమిన్ సి, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి.
  • పాలకూర, ఆకుకూరలను మూతపెట్టి ఉడికించకూడదు. పాలకూరలో ఐరన్‌,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కానీ మూతపెట్టి ఉడికించినట్లయితే విటమిన్ సి త్వరగా ఆక్సీకరణం చెందుతుంది. పాలకూర, ఆకుపచ్చ రంగు తగ్గి రుచి అంతగా ఉండదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మెదక్‌లో ఘోరం.. రైతు భరోసా డబ్బుల కోసం.. తండ్రి నాలుక కోసిన కొడుకు..

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News )

ఇది కూడా చదవండి:
జీవక్రియను పెంచే అల్పాహారం ఇదే.. ఉదయాన్నే తింటే వేగంగా శక్తి స్థాయి పెరుగుతుంది

Advertisment
Advertisment
తాజా కథనాలు