Medak Crime: మెదక్‌లో ఘోరం.. రైతు భరోసా డబ్బుల కోసం.. తండ్రి నాలుక కోసిన కొడుకు..

మెదక్‌ జిల్లా హవేళిఘనపూర్‌ మండలం ఔరంగాబాద్‌ తండాలో విషాదం చోటు చేసుకుంది. బానోత్‌ కీర్యా అనే రైతులకు.. రైతు భరోసా డబ్బులు 6 వేలు వచ్చాయి. ఆ డబ్బు తనకి ఇవ్వలేదని అతని చిన్న కొడుకు సంతోష్‌ తండ్రిని కొట్టడమే కాక కొడవలితో నాలుక కోశాడు.

New Update
money

money

Medak Crime: మెదక్ జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకం కింద తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడు తన తండ్రి నాలుక కోసిన సంఘటన హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో కలకలం రేపుతోంది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం జరిగింది. బానోత్ కీర్యా అనే రైతుకు ఒక ఎకరం భూమి ఉంది. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ డబ్బు రూ.6,000 అతని బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఆ డబ్బు ఇవ్వాలని కీర్యా తన చిన్న కొడుకు సంతోష్‌ నుంచి ఒత్తిడి పెరిగింది. 

రైతు భరోసా డబ్బుల కోసం నాలుక కోశాడు..

ఈ మొత్తాన్ని తండ్రి నుంచి తీసుకోవాలని సంతోష్ పట్టుదలగా ప్రయత్నించాడు. అయితే కీర్యా ఇటీవల ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న  కీర్యా రూ.2,000 వైద్యం కోసం ఖర్చు చేశానని.. మిగతా రూ.4,000 ఇస్తానని చెప్పాడు. కానీ ఈ సమాధానం సంతోష్‌కు నచ్చక కోపంతో ఊగిపోయాడు. తండ్రి మాటలు వినకుండా సంతోష్  కీర్యాపై దాడికి దిగాడు. మొదట అతన్ని మానసికంగా వేదించగా, ఆ తర్వాత శారీరకంగా దాడి చేశాడు. ఈ హింస అక్కడితో ఆగకుండా సంతోష్ తన దగ్గర ఉన్న కొడవలి తీసుకొని కీర్యా నాలుక కోశాడు. 

ఇది కూడా చదవండి: మెదడు చెడు జ్ఞాపకాలను ఎలా చెరిపి వేస్తుంది.. నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు..!!

ఈ దారుణ దాడితో తీవ్ర గాయాలపాలైన కీర్యా రక్తపు మడుగులో విలవిల్లాడుతుండగా.. గమనించిన స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై కీర్యా భార్య మాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే స్పందించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక కొడుకు చేతిలో తండ్రికి ఇలాంటి దుర్గతి కలగడం గ్రామస్థులను షాక్‌కు గురిచేసింది.  రూ.4 వేల కోసం ఈ స్థాయిలో కన్న తండ్రి నాలుక కోయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: జిమ్- డైటింగ్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే.. ఈ పద్ధతులను ట్రై చేయండి

(medak crime | medak crime latest | Medak crime news | ts-crime | ts-crime-news | Latest News | telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు