Ants: ఈ 4 చిట్కాలు.. చీమలు ఇంట్లో నుంచి పరారు

ఇంట్లో నుంచి చీమలు వాటంతట అవే వెళ్లిపోయేలా చేసే కొన్ని సాధారణ ఇంటి చిట్కాలను, పద్ధతులు ఉన్నాయి. నిమ్మరసం-వెనిగర్, పుదీనా, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు ఎలా ఇంట్లో వాడాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Ants

Ants

ఇంట్లో చీమలు(ants) ఉండటం సర్వసాధారణం. కానీ వాటి సంఖ్య పెరిగితే చాలా సమస్యలు సృష్టిస్తాయి. చాలా ఇళ్లలో ముఖ్యంగా వంటగదిలో చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. అవి ఆహార పదార్థాలలోకి చేరి వాటిని పాడు చేస్తాయి. అంతేకాకుండా.. చీమ కుడితే ఒంటిపై దద్దుర్లు, దురద కూడా రావచ్చు. చాలా మంది చీమల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్ నుంచి రసాయన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. కానీ ఇవి హానికరం కావచ్చు. అందుకే  ఇంట్లో నుంచి చీమలు వాటంతట అవే వెళ్లిపోయేలా చేసే కొన్ని సాధారణ ఇంటి చిట్కాలను, పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

చీమలను తరిమి కొట్టె చిట్కాలు:

నిమ్మరసం-వెనిగర్:ఈ చిట్కా కోసం.. ఒక స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో నీరు, వెనిగర్ తీసుకుని.. దానికి కొద్దిగా నిమ్మరసం కలపాలి. చీమలు ఎక్కువగా ఉన్న చోట ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. చీమలు ఈ మిశ్రమం వాసనను అస్సలు ఇష్టపడవు.. దాంతో అవి పారిపోతాయి. ఈ నివారణను ఉపయోగించిన తర్వాత చీమలు మళ్లీ రావు.

పుదీనా (Mint):బలమైన వాసన వచ్చే వస్తువులు అంటే చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి వాటిని వదిలించుకోవడానికి పుదీనాను ఉపయోగించవచ్చు. చీమలు గూడు కట్టిన ప్రదేశాలలో పుదీనా ఆకులను ఉంచవచ్చు. నీటిలో కొన్ని చుక్కల పుదీనా నూనె (Mint Oil) కలిపి కూడా స్ప్రే చేయవచ్చు. ఇది చీమల బెడదను తొలగించడమే కాకుండా.. ఇంటికి తాజాగా సువాసన వచ్చేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి: అక్కడ నొక్కితే పొట్టలోని గ్యాస్ బస్సుమంటూ బయటకొచ్చేసింది తెలుసా!!

బిర్యానీ ఆకు (Bay Leaf): ఈ నివారణ కోసం.. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి.. అందులో 4-5 బిర్యానీ ఆకులు, కొద్దిగా ఉప్పు వేసి 5-7 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి.. స్ప్రే బాటిల్‌లో పోయాలి. చీమలు ఎక్కువగా కనిపించే చోట ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. బిర్యానీ ఆకులలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కీటకాలను తరిమికొట్టడానికి సహాయపడతాయి.

నల్ల మిరియాలు (Black Pepper): చీమలను తరిమికొట్టడంలో నల్ల మిరియాల చిట్కా కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని ఉపయోగించడానికి.. కిటికీలు, సింక్‌లు, తలుపుల చుట్టూ నల్ల మిరియాల పొడిని చల్లండి. చీమలకు దీని ఘాటైన వాసన పడదు.. అందుకే చీమలను తరిమికొట్టడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నోరు పొడిబారుతుందా..? కారణం అయితే ఇదే.. మరి ఉపశమనం ఎలానో తెలుసా!!

Advertisment
తాజా కథనాలు