Stomach Gas: అక్కడ నొక్కితే పొట్టలోని గ్యాస్ బస్సుమంటూ బయటకొచ్చేసింది తెలుసా!!

ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతుంది. కడుపులో గ్యాస్‌ ఉంటే తేన్పులు, ఉబ్బరం, నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం పొందడానికి సోంపు, ఇంగువ, వాము తింటారు. తక్షణ ఉపశమనం ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
stomach gas

Stomach Gas

కడుపులో గ్యాస్ సమస్య సర్వసాధారణం. దీనికి ప్రధాన కారణాలు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం,   అనారోగ్యకరమైన జీవనశైలి. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా గ్యాస్ ఇబ్బంది పెడుతుంది. కడుపులో గ్యాస్ సాధారణ లక్షణాలు తేన్పులు, ఉబ్బరం, నొప్పి, అసౌకర్యం. గ్యాస్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది సోంపు, ఇంగువ, వాము వంటివి తీసుకుంటారు. అయితే వీటితో పనిలేకుండానే తక్షణ ఉపశమనం అందించే అక్యుప్రెషర్ పాయింట్ల గురించి  కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌ తెలుసుకుందాం.

కడుపులో గ్యాస్ తగ్గాలంటే..

కడుపులో గ్యాస్ ఉన్నప్పుడు ఏ పాయింట్ నొక్కాలి? (Which point to press for stomach gas?) కడుపులో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మూడు ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. వీటిని నొక్కితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

CV12-నాభికి 4 అంగుళాల పైన: నాభికి సుమారు 4 అంగుళాలపైన.. కడుపుకు సరళ రేఖలో ఉండే ఈ పాయింట్‌ను సున్నితంగా నొక్కి.. నెమ్మదిగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి.

CV6-నాభికి ఒకటిన్నర అంగుళం క్రింద: నాభికి సుమారు ఒకటిన్నర అంగుళం క్రింద.. అదే రేఖలో ఉండే ఈ పాయింట్‌ను 2 నుంచి 3 వేళ్లతో తేలికపాటి ఒత్తిడితో మసాజ్ చేయాలి.

PC6-మణికట్టు: మణికట్టు లోపలి వైపున, మణికట్టు మడత (wrist crease) నుంచి సుమారు 3 వేళ్ల క్రింద ఈ పాయింట్ ఉంటుంది. దీనిని నొక్కడం వల్ల గ్యాస్ నొప్పి, వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది.

 ఇది కూడా చదవండి:  పొద్దునే ఎవరి ముఖం చూడాలో తెలుసా..?

తక్షణమే గ్యాస్ నుంచి ఉపశమనం కావాలంటే కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి. వాటిల్లో ఇంగువ, సోంపు గింజలు, వాము తీసుకోవచ్చు. నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగడం లేదా కొంతసేపు నడవడం కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. అల్లం టీ (Ginger tea) కూడా గ్యాస్ సమస్యకు అద్భుతమైన నివారణగా పని చేస్తుంది. చీలమండ (ankle) పైన సుమారు మూడు అంగుళాల ఎత్తులో ఉన్న SP6 పాయింట్‌ను 2 నుంచి 3 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయవచ్చు. మలబద్ధకం, కడుపులో నొప్పి, భారంగా భావిస్తున్నట్లయితే.. మలవిసర్జన (bowel movement) సజావుగా సాగడానికి ఈ అక్యుప్రెషర్ పాయింట్లు నొక్కవచ్చు.

CV6 -నాభి క్రింది పాయింట్: నాభికి సుమారు 1.5 అంగుళాల క్రింద ఉండే ఈ పాయింట్‌ను 2 నుంచి 3 వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి.

LI4-చేతి పాయింట్: బొటనవేలు, చూపుడు వేలు మధ్య ఉన్న మృదువైన ప్రాంతంలో సున్నితమైన ఒత్తిడిని కలిగించాలి. ఇది ప్రేగులు సరిగా పనిచేయడానికి,  ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: తినడానికి ముందు ఈ చిట్కా పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య దరి చేరదు

Advertisment
తాజా కథనాలు