/rtv/media/media_files/2024/12/20/hLCKYxOC7UqSgv73rCcU.jpg)
Hibiscus Tea
మందార పువ్వులను ఎక్కువగా జుట్టు కోసం వాడుతుంటారు. వీటిని ఆయిల్‌లో కలిపి తలకు రాసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుందని అంటుంటారు. అయితే ఈ మందార పువ్వులతో చేసిన టీని తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు అంటున్నారు. మందార పువ్వులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుతో పాటు అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
రక్తపోటును అదుపులో..
ఎక్కువగా రక్తపోటుతో బాధపడేవారు ఈ మందార పువ్వుల టీని డైలీ తాగడం మంచిది. ఉదయం లేదా సాయంత్రం వేళలో ఈ టీని తాగడం వల్ల బీపీ తగ్గుతుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ టీలోని పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడేలా చేస్తుంది. అలాగే డయాబెటిక్ రోగులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ టీ డైలీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయి. అలాగే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
ఇది కూడా చూడండి: Dengue: బొప్పాయి ఆకులు నిజంగానే ప్లేట్లెట్స్ ను పెంచుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?
మందార పువ్వుల టీ ఎలా చేయాలంటే?
మందార పువ్వుల టీ చేయాలంటే నాలుగు కప్పుల నీటిలో రెండు టేబుల్ స్పూన్ల మందార పువ్వుల పొడి వేయాలి. ఇందులో పుదీనా, నిమ్మకాయ, తేనె వంటివి కూడా వేయవచ్చు. రెండు కప్పులకు నీరు వచ్చిన తర్వాత వడబోసుకుంటే చాలు. మందార పువ్వుల టీ అయిపోయినట్లే.
ఇది కూడా చూడండి: Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.