/rtv/media/media_files/2025/10/27/alzheimer-2025-10-27-14-38-42.jpg)
Alzheimer
Memory Loss: జ్ఞాపకశక్తిని కోల్పోవడం (Memory Loss), అభిజ్ఞా క్షీణత (Cognitive Decline)కు కారణమయ్యే వ్యాధి అల్జీమర్స్. ఈ సమస్య సాధారణంగా వృద్ధులలో కనిపిస్తుంది. అయితే అల్జీమర్స్ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి. దీనికి కారణమేంటో తెలుసుకోవాలంటే.. మెదడు వృద్ధాప్యంపై తాజాగా వెలువడిన ఒక అధ్యయనం వివరాలు తెలుసుకోవాలి. ఓ అధ్యయనంలో పరిశోధకులు 17 నుంచి 95 సంవత్సరాల మధ్య వయస్సు గల 4700 మంది పెద్దల మెదళ్ళను పరిశీలించారు. మెదడు వృద్ధాప్యం కూడా లింగంపై ఆధారపడి ఉంటుందా లేదా అని వారు పరిశోధించారు. అల్జీమర్స్ ముప్పు మెదడుపై ఎలా పడుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ముప్పు మహిళలకే ఎందుకు ఎక్కువ..
ఈ అధ్యయనం ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాలక్రమేణా స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ మెదడు వృద్ధాప్యం జరుగుతుందని వెల్లడైనప్పటికీ.. ఇద్దరికీ ఫలితాలు ఒకే విధంగా లేవు.
పురుషులు: పురుషులలో మహిళల కంటే వేగంగా మెదడు వృద్ధాప్య సంకేతాలు కనిపించాయి. ఈ క్షీణత ముఖ్యంగా జ్ఞాపకశక్తి, భావోద్వేగాలకు కారణమయ్యే మెదడులోని ప్రాంతాలలో (పారాహిప్పోకాంపల్ కార్టెక్స్ వంటివి) కనిపించింది.
మహిళలు: మహిళల్లో తక్కువ ప్రాంతాలలో మెదడు వృద్ధాప్య సంకేతాలు కనిపించాయి. అయితే.. ఈ సమయంలో వారి మెదడులోని వెంట్రికల్స్ పరిమాణం పెరుగుతున్నట్లు కనిపించింది. ఆశ్చర్యకరంగా పురుషులలో మెదడు కణజాలం వేగంగా క్షీణించి, మెదడు నిర్మాణం తగ్గిపోతున్నప్పటికీ.. జ్ఞాపకశక్తి కోల్పోయే అల్జీమర్స్ వంటి సమస్యలకు మాత్రం మహిళలే ఎక్కువ గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకునే అద్భుతమైన ఇంటి చిట్కా.. టీ పొడితో దీపం వెలిగించండి!!
మెదడు వృద్ధాప్యంలో ఈ వ్యత్యాసానికి జీవక్రియ పనితీరు (Metabolic function), ఎపిజెనెటిక్ మార్పులు, హార్మోన్లు వంటి అనేక కారణాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మహిళల్లో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వారి శరీరంలో జరిగే వేగవంతమైన హార్మోన్ల మార్పులే అని పరిశోధకులు పేర్కొన్నారు. మెనోపాజ్, గర్భం, ఋతుస్రావం (Menstrual Cycle) కారణంగా మహిళలు ఎదుర్కొనే వివిధ మార్పులు అల్జీమర్స్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఈ పరిశోధన ద్వారా అల్జీమర్స్ చికిత్స కోసం లింగ-నిర్దిష్ట వ్యూహాలను రూపొందించడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఉందా..? నిపుణుల సలహాలు.. పరిష్కార మార్గాలు తెలుసుకోండి!!
Follow Us