Health Tips: మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఉందా..? నిపుణుల సలహాలు.. పరిష్కార మార్గాలు తెలుసుకోండి!!

మోషన్ ఫ్రీగా లేకపోవటంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఉడికిన ఆహారాలు ఎక్కువగా తీనకుంటా ఆహారంలో ఫైబర్ శాతం ఎక్కువగా పండ్లను తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, బత్తాయి, కమల వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

New Update
constipation

constipation

శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం మోషన్‌లో ఇర్రెగ్యుల్ (irregular bowel movements). మోషన్ ఫ్రీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే.. చాలా జబ్బుల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్న పిల్లల్లో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలకు కూడా మోషన్ ఫ్రీగా లేకపోవడమే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోషన్ ఫ్రీగా ఉంటే పైల్స్ (మొలలు), గ్యాస్ ట్రబుల్, అల్సర్, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే  మోషన్ ఫ్రీ ఉంటాచే నిపుణుల సలహాలు.. పరిష్కార మార్గాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మోషన్ ఇర్రెగ్యులర్‌కు కారణాలు:

మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఉండటానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. దీర్ఘకాలపు మానసిక ఒత్తిడి (Chronic stress) కారణంగా ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య తగ్గాలంటే దగ్గరలోని యోగా కేంద్రాలకు వెళ్లడం, కౌన్సిలింగ్ తీసుకోవడం వంటివి చేయాలి. రెండొవది ఆహారంలో ఫైబర్ తగ్గడం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఉడికిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఆహారంలో ఫైబర్ శాతం తగ్గి.. పేగుల్లో కదలికలు లేకపోవడం వలన మలం బయటకు రావడానికి ఆలస్యం అవుతుంది. అయితే తినడం ఎంత ముఖ్యమో.. లోపలికి వెళ్లిన పదార్థం బయటికి రావడం కూడా అంతే ముఖ్యం. మోషన్ నిల్వ ఉంటే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి పరిష్కారం ఆహార నియమాలు పాటించాలి. అంతేకాదు వంటగదిలోనే పరిష్కారం ఉంది. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోషన్ ఫ్రీగా ఉంచుకోవచ్చు. తినకూడని ఆహారాలు ఉన్నాయి.  వాటిల్లో ఫైబర్ శాతం లేని ఆహార పదార్థాలను రెండు నెలల పాటు పూర్తిగా మానేయాలి.ఫైబర్ లేని ఆహారాలలో గుడ్డు, మాంసాహారాలు, పాలు వంటివి ఉంటాయి. తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు ఫైబర్ అధికంగా ఉండేవి. 15 రోజుల నుంచి నెల రోజుల పాటు రెండు పూటలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

 ఇది కూడా చదవండి: మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే క్యాన్సర్ ఉన్నట్లే!

 ఉదయం మరియు సాయంత్రం పీచు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, బత్తాయి, కమల వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అయితే అరటిపండును మాత్రం తినకూడదు. పండ్లు తింటే నీరసం వస్తుందేమో అనుకుంటారు. కానీ శరీరానికి శక్తి లభిస్తుంది. రాత్రి సమయంలో ఎక్కువగా ఆకలి అవుతుంటే పండ్లు తినవచ్చు. మధ్యాహ్నం సమయంలో సాధారణ ఆహారం ఎక్కువగా తినవచ్చు.. అయితే అందులో ఆకుకూరలు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవడం ఇంకా మంచిది. అంతేకాకుండా ఉదయం, సాయంత్రం వేడివేడిగా రాగి జావ తాగడం మంచి ఫలితం ఉంటుంది. రాగి జావలో పాలు పోయకుండా మజ్జిగ, పెరుగు పీచ్‌ కోసం కొద్దిగా క్యారెట్ తురుము కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. పండ్లు తిన్న తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే.. రోజు మొత్తంలో ఆరేడు గ్లాసుల మజ్జిగ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవద్దని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: అపార పుణ్యం అందించే కార్తీక మాసం.. నదీ స్నానం, దీపారాధన మహిమ తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు