/rtv/media/media_files/2025/06/25/weight-loss-injection-2025-06-25-11-49-09.jpg)
weight loss injection
Novo Nordisk: నేటి కాలంలో అధిక బరువు, ఊబకాయం సమస్యలపై పోరాటానికి మరో శక్తివంతమైన ఔషధం భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌కు చెందిన నోవోనార్డిస్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన వెగోవీ అనే ఇంజెక్షన్‌ను మంగళవారం భారత మార్కెట్‌లో విడుదల చేశారు. బరువు తగ్గాలనుకునే వారు వైద్యుల సూచన మేరకు వారానికి ఒక్కసారి ఈ ఇంజెక్షన్ వేసుకోవాలి. సెమాగ్లూటైడ్ అనే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1 రిసెప్టర్‌తో రూపొందించిన ఈ ఔషధం శరీరంలోని సహజ GLP-1 హార్మోన్‌లా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడం, ఆకలిని తగ్గించడం వంటి ప్రభావాలు కలిగిస్తుంది. తినిన ఆహారం కడుపులో ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. దాంతో మనకు త్వరగా ఆకలి వేయదు. ఈ విధంగా ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గేందుకు సులభం..
వెగోవీ ఉపయోగం కేవలం బరువు తగ్గడానికే పరిమితముకాదు. మధుమేహం, గుండె సంబంధిత రోగాలు, ఫ్యాటీలివర్ వంటి సమస్యల నియంత్రణకు కూడా ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్‌ను వాడినవారు సుమారుగా 10 నుంచి 15 శాతం వరకు బరువు తగ్గుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒజెంపిక్, మౌంజారో అనే ఇంజెక్షన్లతో పోలిస్తే వెగోవీ బరువు తగ్గించడంపై మరింత దృష్టి పెట్టిన ఔషధంగా నిలుస్తుంది. ఒజెంపిక్ కూడా సెమాగ్లూటైడ్‌తో తయారవుతుందే కానీ.. దానిని ప్రధానంగా మధుమేహ చికిత్సలో వాడతారు. ఇక మౌంజారోలో టిర్జెపటైడ్ అనే సమ్మేళనాన్ని వాడతారు. ఇది GLP-1తోపాటు GIP అనే రెండింటిని ప్రభావితం చేసే విధంగా పని చేస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ కూరగాయలను మూతపెట్టి ఉడికించోదా..? రుచితోపాటు ఆరోగ్యానికి హానని తెలుసా..!!
వెగోవీ ధర మాత్రం చాలా ఎక్కువ. 0.25 మి.గ్రా నుంచి 1 మి.గ్రా వరకు ఉండే డోసుల డెలివరీ ప్యాక్ ధర రూ.17,345. 1.7 మి.గ్రా డోసుతో ఉన్న నాలుగు ఇంజెక్షన్ల ప్యాక్ ధర రూ.24,280. అలాగే 2.4 మి.గ్రా డోసులతో ఉన్న ప్యాక్ ధర రూ.26,015. మొదట చిన్న మోతాదుతో ప్రారంభించి, ఫలితాలను బట్టి తదుపరి డోసులను వైద్యులు సూచిస్తారు. అయితే ఈ ఇంజెక్షన్‌ను ప్రతి ఒక్కరికీ ఇవ్వరు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30కంటే ఎక్కువ ఉన్నవారు, లేదా BMI 27 కంటే ఎక్కువగా ఉండి, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికే ఈ ఇంజెక్షన్‌ను సిఫారసు చేస్తారు. మొత్తంగా వెగోవీ... అధిక బరువుతో పోరాడే వారికి మరో కొత్త మార్గాన్ని అందించనుంది.
ఇది కూడా చదవండి: శరీర దుర్వాసన వస్తుందా..? నివారణకు ఇంటి చిట్కాలు ఇలా ట్రై చేయండి
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news | lose-weight)