Body Odor: శరీర దుర్వాసన వస్తుందా..? నివారణకు ఇంటి చిట్కాలు ఇలా ట్రై చేయండి

శరీరంపై చేరిన మురికి, స్వేదం వల్ల ఏర్పడే బ్యాక్టీరియా దుర్వాసనకు కారణమవుతాయి. దీనిని తగ్గించాలంటే దినసరి స్నానం అలవాటు చేసుకోవాలి. స్నానానంతరం శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టి, పొడిగా ఉన్న భాగాలపై మాత్రమే డియోడరంట్ అప్లై చేయాలి.

New Update
Body Odor

Body Odor

Body Odor: శరీర దుర్వాసన అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనివల్ల వ్యక్తిగత పరువు దెబ్బతినే అవకాశంతోపాటు ఇతరులపై మన ప్రభావం కూడా తగ్గిపోతుంది. కొంతమంది ఎంత శుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించినా.. వారి శరీరం నుంచి వచ్చే వాసనను పూర్తిగా నియంత్రించలేరు. దీని వెనుక తెలియక చేసేవారి కొన్ని చిన్న తప్పులే కారణమవుతుంటున్నారు డెర్మటాలజిస్టుల నిపుణులు. వారి అభిప్రాయం ప్రకారం.. శరీర దుర్వాసన నివారణకు సరైన ఉత్పత్తుల ఎంపిక, వాటి వినియోగ పద్ధతులపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమంటున్నారు.

రోజూ శుభ్రంగా ఉండాలంటే..

దుర్వాసనను దూరం ఉంచాలంటే మొదటగా దినసరి స్నానం అలవాటు చేసుకోవాలి. శరీరంపై చేరిన మురికి, స్వేదం వల్ల ఏర్పడే బ్యాక్టీరియా దుర్వాసనకు కారణమవుతాయి. ముఖ్యంగా బాహుమూలాలు, కాళ్ల మధ్య భాగం వంటి చోట్ల ఈ బ్యాక్టీరియా అధికంగా పెరుగుతాయి. వీటిని రోజూ శుభ్రంగా కడగడం ద్వారా దుర్వాసనను కంట్రోల్ చేయవచ్చు. అలాగే చర్మంపై పేరుకుపోయే మృత కణాలను తొలగించేందుకు వారానికి ఒకసారి స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌ చేయడం మంచిది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంతోపాటు.. శుభ్రతను మెరుగుపరుస్తుంది. పర్‌ఫ్యూమ్, బాడీ స్ర్పే వాడేటప్పుడు సరైన పద్ధతిని పాటించడం చాలా ముఖ్యం. మొదట నచ్చిన సెంటెడ్ బాడీ లోషన్‌ను, క్రీమ్‌ను మెడ, మణికట్టు, చెవి వెనుక భాగాల్లో అప్లై చేయాలి. అనంతరం అదే గంధాన్ని కలిగి ఉన్న పర్‌ఫ్యూమ్‌ను అక్కడికి స్ప్రే చేయాలి. సెంట్ రాసిన వెంటనే చేత్తో రుద్దకూడదు.. అది సహజంగా ఆరిపోయేలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా వాసన ఎక్కువసేపు ఉంటుంది. 

ఇది కూడా చదవండి: జిమ్- డైటింగ్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే.. ఈ పద్ధతులను ట్రై చేయండి

డియోడరంట్ ఎంపిక కూడా శరీర గంధాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డియోడరంట్‌ను స్వేద గ్రంథులను పూర్తిగా మూసివేయకుండా, దుర్వాసనను అణిచే విధంగా వాడాలి. స్నానానంతరం శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టి, పొడిగా ఉన్న భాగాలపై మాత్రమే డియోడరంట్ అప్లై చేయడం వల్ల దీని ప్రభావం మెరుగ్గా కనిపిస్తుంది. దుస్తులు కూడా శరీర దుర్వాసనలో కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా మార్చని.. సరిగ్గా ఉతకని దుస్తులు దుర్వాసనకు దారితీస్తాయి. అందువల్ల దుస్తులను మంచి సువాసన కలిగిన డిటర్జెంట్‌తో ఉతకాలి. అవసరమైతే ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ వాడితే మరింత మంచి ఫలితం ఉంటుంది. అలానే.. దుస్తులను నిల్వ చేసేటప్పుడు శాషెలు వాడితే.. ఆ దుస్తులు తాజాగా ఉండే అవకాశముంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే శరీర దుర్వాసనపై నియంత్రణ సాధించి.. రోజంతా తాజాగా ఉండవచ్చు. సరైన అలవాట్లతోపాటు, శుభ్రతపై శ్రద్ధ తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా దూరం చేయడం సాధ్యమౌతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ కూరగాయలను మూతపెట్టి ఉడికించోదా..? రుచితోపాటు ఆరోగ్యానికి హానని తెలుసా..!!

health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)

 

Advertisment
Advertisment
తాజా కథనాలు