/rtv/media/media_files/2025/09/18/vitamin-deficiency-2025-09-18-06-51-16.jpg)
Vitamin Deficiency
విటమిన్లు శరీరానికి చాలా ముఖ్యమైనవి. విటమిన్ల లోపం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ ఎ లోపం వల్ల కంటి సమస్యలు, రేచీకటి వస్తాయి. అలాగే విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత, నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. ఇది చిగుళ్ళ నుంచి రక్తం కారడం, బలహీనతకు కారణమవుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో ఆస్టియోమలాసియా వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాలను నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె జబ్బులు ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం ప్రస్తుత జీవనశైలిలో చాలామందిని వేధిస్తోంది. ఆరోగ్యకరమైన గుండె కోసం కేవలం వ్యాయామం, సరైన నిద్ర మాత్రమే కాకుండా.. తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని విటమిన్ల లోపం గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
విటమిన్ల లోపం గుండెకు ప్రమాదాలు:
గుండె ఆరోగ్యానికి చాలా విటమిన్లు అవసరం. కానీ ముఖ్యంగా రెండు విటమిన్ల లోపం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అవే విటమిన్ డి మరియు విటమిన్ బి12. విటమిన్ డి లోపం వల్ల రక్తపోటు (Blood Pressure) మరియు మధుమేహం (Diabetes) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ రెండు సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా చెబుతారు. శరీరంలో విటమిన్ బి12 లోపించినప్పుడు.. హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను దెబ్బతీస్తుంది. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన ఇతర విటమిన్లు కూడా ఉన్నాయి. వాటిల్లో పైన పేర్కొన్న వాటితోపాటు.. విటమిన్ సి, విటమిన్ బి9, విటమిన్ ఇ కూడా గుండెకు చాలా ముఖ్యమైనవి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రక్త గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. విటమిన్ బి9 హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలొ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ముక్కు వెంట్రుకలు కత్తిరించుకుంటే ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయో తెలుసా..?
ఈ విటమిన్ల లోపాన్ని అధిగమించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమ మార్గాలు ఉన్నాయి. విటమిన్ బి12: మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ డి: ఉదయం పూట ఎండలో కాసేపు ఉండటం, పుట్టగొడుగులు, పాలు, చేపలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా ఈ విటమిన్ పొందవచ్చు. విటమిన్ సి: నారింజ, నిమ్మ, కివి, ఉసిరి వంటి పుల్లటి పండ్లు, క్యాప్సికమ్, బ్రోకలీ వంటి కూరగాయలు ఈ విటమిన్‌ను అధికంగా కలిగి ఉంటాయి. మీ ఆహారంలో ఈ మార్పులు చేయడం ద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మీకు విటమిన్ల లోపం ఉందని అనుమానం ఉంటే.. వైద్య నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నాలుగు రోజులు చాలు జంక్ ఫుడ్ మీ బుర్రను తినేయడానికి!!