Health Tips: తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచేందుకు చక్కటి చిట్కాలు!

చలికాలంలో ఉదయం త్వరగా.. చురుకుగా మంచం దిగడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చల్లటి గాలిలో లేవాలంటే అది ఒక పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అయితే ఉదయం నిద్ర లేవడానికి సహాయపడే సులభ చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
waking up morning

waking up early

Health Tips: అక్టోబరు ఉదయం, సాయంత్రం వేళల్లో చలి క్రమంగా పెరుగుతోంది. చాలామందికి ఈ చల్లని వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించినా.. ఉదయం పూట మంచం నుంచి లేవడానికి మాత్రం చాలా కష్టపడతారు. వెచ్చని దుప్పటిని వదిలి.. చల్లటి గాలిలో లేవాలంటే అది ఒక పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అయితే.. చలికాలంలో కూడా ఉదయం త్వరగా.. చురుకుగా మంచం దిగడానికి సహాయపడే ఐదు సులభ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఆరోగ్యం ఉంటారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: గచ్చిబౌలిలో విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

త్వరగా నిద్ర లేవాలంటే.. 

రాత్రి నిద్ర సమయం: ఉదయం త్వరగా లేవాలంటే.. రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మొబైల్ లేదా టీవీ చూస్తూ ఆలస్యంగా పడుకుంటే.. శరీరానికి తగినంత నిద్ర లభించదు. దీనివల్ల ఉదయం లేవడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి రాత్రి 9 లేదా 10 గంటల మధ్య నిద్ర పోవాలి. ఇది శరీర జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించి.. త్వరగా లేచేలా చేస్తుంది.

అలారం గడియారం దూరం: అలారం మోగినప్పుడు చాలామంది సోమరితనం వల్ల వెంటనే దాన్ని ఆపేస్తారు. ఈ అలవాటును మానుకోవడానికి.. అలారం గడియారాన్ని మంచానికి కొంచెం దూరంగా పెట్టాలి. అలారం ఆపడానికి తప్పనిసరిగా లేవాల్సి వస్తుంది. అలా లేవగానే సగం సోమరితనం దానంతటదే తొలగిపోతుంది.

ఇది కూడా చదవండి: బియ్యం పిండి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగకరమండి!!

లేవగానే కర్టెన్లు తెరవడం: ఉదయం లేవగానే వెంటనే కర్టెన్లు తెరిచి.. వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేయండి లేదా లైట్లు వేయండి. ప్రకాశవంతమైన కాంతి మెదడుకు మేల్కొనడానికి సంకేతాలు పంపి.. వెంటనే చురుకుదనాన్ని కలిగిస్తుంది.

అందుబాటులో వెచ్చని దుస్తులు: చలిని తగ్గించుకోవడానికి..మంచం పక్కనే స్వెటర్ లేదా జాకెట్ సిద్ధంగా ఉంచాలి. అలారం మోగగానే దాన్ని వెంటనే ధరించాలి. ఇది చలి అనుభూతిని తగ్గించి.. లేవడం సులభం చేస్తుంది.

ఇది కూడా చదవండి: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!

గోరువెచ్చని నీరు: నిద్ర లేచిన వెంటనే గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఇది శరీరానికి హైడ్రేషన్‌ను అందించి.. శక్తినిస్తుంది. నీరు తాగడం వల్ల నిద్రమత్తు, సోమరితనం తక్షణం తగ్గుతాయి. ఈ 5 సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా చల్లని వాతావరణంలో కూడా ఉదయం త్వరగా లేచి రోజును సకాలంలో ప్రారంభించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: దీపావళి వేడుకలు.. ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా ఈ వస్తువులు కిచెన్ నుంచి తరిమేయండి!!

Advertisment
తాజా కథనాలు