/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
Gachibowli
Gachibowli : గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ గచ్చిబౌలి టీఎన్‌జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా వారు గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
ఇదే పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్న కుమారుడు నిఖిల్ తేజ్(4) చదువుతున్నారు. కాగా మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో పిల్లలను ఇంటికి తీసుకురావడానికి ఆటో డ్రైవర్ వెళ్లాడు. పాఠశాల వద్ద కేవలం ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడని తండ్రి బోయిని పరమేశ్వర్ కు ఆటో డ్రైవర్ పోన్ చేసి తెలిపాడు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. నిఖిల్ తేజ్ కోసం పాఠశాల ఆవరణలో గాలించారు. పాఠశాల వెనుక వైపు ఉన్న నీటి సంపులో నిఖిల్ తేజ్ పడి ఉండటాన్ని వారు గుర్తించారు. బాలుడు విగతజీవిగా సంపులో పడి ఉండటంతో ఒకసారిగా షాక్‌కు గురయ్యారు. నిఖిల్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయమై గచ్చిబౌలి పోలీసులకు తండ్రి బోయిని పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్