Tea: చాయ్‌లో వేయకూడనివి ఇవే.. వేస్తే మీ ఆరోగ్యం సంగతి అంతే!!

చలికాలంలో టీ మనకు తక్షణ ఉత్సాహాన్ని ఇచ్చినా.. దానిని తయారు చేసే విధానంలో చేసే చిన్న పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం. రుచి, రంగు కోసం మనం చేసే కొన్ని తప్పులు తప్పక నివారించాల్సిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Tea

Tea

భారతదేశంలో ఉదయం వేళ టీ లేనిదే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. చలికాలంలో టీ మనకు తక్షణ ఉత్సాహాన్ని ఇచ్చినా.. దానిని తయారు చేసే విధానంలో చేసే చిన్న పొరపాట్లు ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. రుచి, రంగు కోసం మనం చేసే కొన్ని తప్పులు శరీరాన్ని నెమ్మదిగా పాడు చేస్తాయి. ముఖ్యంగా ఉదయం పూట టీ విషయంలో తప్పక నివారించాల్సిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఉదయపు టీలో ఇవి కలిపితే ప్రమాదమే..

పాలు, టీ ఆకులను ఎక్కువసేపు మరిగించడం వద్దు: చాలామంది టీకి మంచి రంగు రావడానికి పాలు, టీ ఆకులను ఎక్కువసేపు మరిగిస్తుంటారు. దీనివల్ల టీలో ఆమ్లత్వం (Acidity) పెరిగి గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీ రుచి, వాసన సరిగా రావడానికి అవసరమైనంత సమయం మాత్రమే మరిగించడం మంచిది.

ఎక్కువ చక్కెర: స్వీట్‌గా ఉండే టీ అందరికీ ఇష్టమే అయినా.. అధిక చక్కెర వాడకం ఊబకాయం, మధుమేహం (Diabetes), శరీరంలో వాపు వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి టీలో చక్కెర పరిమాణాన్ని తగ్గించడం లేదా పాలు లేని టీలో బెల్లం వంటి సహజ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి:  రోజుకు శక్తినిచ్చే అద్భుతమైన పానీయాలు.. ఉదయాన్నే వీటిని తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం!!

పాలు, బెల్లం: బెల్లం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ.. పాల టీలో (Milk Tea) బెల్లం కలిపితే అది పాలను విరగొట్టే (curdle) అవకాశం ఉంది. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఒకవేళ బెల్లం టీ తాగాలని అనుకుంటే.. పాలు లేకుండా బెల్లం టీ తయారు చేసుకోవడం ఆరోగ్యకరం.

ఉప్పు, పాలు: కొంతమంది ఉప్పు లేదా మసాలాతో కూడిన టీ తాగడానికి ఇష్టపడతారు. అయితే పాలు, ఉప్పు కలిపి తాగడం శరీరంలో విషపదార్థాలను పెంచే అవకాశం ఉంది. ఇది గ్యాస్, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలకు కారణమవుతుంది.
ఈ చిన్న పొరపాట్లు చేస్తుంటే.. టీ తయారీ విధానాన్ని మార్చుకుని మరింత ఆరోగ్యకరమైన ఉదయపు టీని ఆస్వాదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: ముఖంపై ముడతలు రావొద్దంటే.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Advertisment
తాజా కథనాలు