Health Tips: మీ కిడ్నీలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి!

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. శరీరంలో అదనపు నీరు పేరుకుపోయి ముఖం, కాళ్లు, చేతులు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలసట, బలహీనత, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీరు తాగాలి, ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి.

New Update
kidneys

kidneys

మూత్రపిండాలు లేదా కిడ్నీలు(Kidneys) శరీరంలో ముఖ్యమైన అవయవాలు. అవి నడుము వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. కిడ్నీల ప్రధాన విధి రక్తాన్ని శుభ్రం చేయడం. శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా రక్తపోటును నియంత్రించడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడటం, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటం వంటి ఇతర పనులను కూడా కిడ్నీలు నిర్వహిస్తాయి. ఈ విధులు సరిగా జరగకపోతే.. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనవి అని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలకు ప్రారంభ లక్షణాలు, వాటిని నివారించే మార్గాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

రాత్రి పూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లడం..

శరీరంలో మూత్రపిండాలు నిరంతరం పనిచేస్తూ మలినాలను, అదనపు నీటిని బయటకు పంపుతాయి. ఖనిజ లవణాలను సమతుల్యం చేసి.. హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే.. కిడ్నీల ప్రత్యేకత ఏంటంటే.. అవి సమస్య వచ్చినా చాలా కాలం వరకు ఎలాంటి లక్షణాలు చూపించవు. సమస్య తీవ్రమయ్యే వరకు మనం వాటిని గుర్తించలేం. కిడ్నీ సమస్యల ప్రారంభ లక్షణాలను విస్మరించడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ప్రారంభ దశలో మూత్రంలో మార్పులు గమనించాలి. మూత్రం రంగు చిక్కగా మారడం, నురుగు రావడం, మూత్రం చాలా తక్కువగా లేదా ఎక్కువగా రావడం, రాత్రి పూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లడం, మూత్రంలో రక్తం కనిపించడం వంటివి కిడ్నీ సమస్యలకు సంకేతాలు. 

ఇది కూడా చదవండి: ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీ ఖేల్ ఖతం!!

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. శరీరంలో అదనపు నీరు పేరుకుపోయి ముఖం, కాళ్లు, చేతులు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం, వాంతులు, నోట్లో లోహపు రుచి, చర్మం దురద, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీ సమస్యల వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవ్వొచ్చు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు(latest health tips) పాటించాలి. వాటిల్లో రోజుకు సరిపడా నీరు తాగాలి. ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి. అంతేకాకుండా  రక్తపోటు, షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యం సేవించడం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.. తీవ్రమైన వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:ఫ్లష్ చేసిన తర్వాత మలం తేలితే డేంజర్.. ఆ షాకింగ్ వ్యాధి ఉన్నట్లే!

Advertisment
తాజా కథనాలు