/rtv/media/media_files/2025/08/13/kidney-failure-2025-08-13-14-28-49.jpg)
Kidney Failure
శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైన అవయవాలు. ఇవి వెన్నెముకకు ఇరువైపులా, పొత్తికడుపు వెనుక భాగంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థ పదార్థాలను, విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. కిడ్నీలు నీరు.. ఎలక్ట్రోలైట్స్, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కిడ్నీలు విఫలమైనప్పుడు.. శరీరం సరిగా పనిచేయదు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తే.. ఆ ప్రభావం మొదటగా ముఖంపై కనిపిస్తుంది. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ముఖంపై కనిపించే సంకేతాలు:
ఉదయం నిద్ర లేవగానే కళ్ల కింద లేదా చుట్టూ వాపు కనిపిస్తే.. అది కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోవడానికి సంకేతం కావచ్చు. కిడ్నీల సమస్యతో రక్తహీనత (Anemia) ఏర్పడుతుంది. దీనివల్ల ముఖం పాలిపోయినట్లు లేదా పసుపు రంగులోకి మారినట్లు కనిపిస్తుంది. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు శరీరం తేమను కోల్పోతుంది. దీని వల్ల పెదవులు పగలడం, చర్మం పొడిబారడం, ముఖంలో కాంతి తగ్గడం వంటివి జరుగుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళకపోతే.. అవి చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు లేదా దురదకు కారణమవుతాయి.
ఇది కూడా చదవండి: జుట్టు అనారోగ్య సమస్యలను గుర్తిస్తుందా..? సేఫ్‌గా ఉండాలంటే నిజాలు ముందుగానే తెలుసుకోండి
కిడ్నీ సమస్యల వల్ల అలసట, నిద్రలేమి ఏర్పడతాయి. దాని ప్రభావం కళ్ల కింద నల్లటి వలయాలుగా కనిపిస్తుంది. కారణం లేకుండా ముఖం ఉబ్బినట్లు అనిపిస్తే.. అది శరీరంలో ద్రవాలు చేరినట్లు సూచిస్తుంది. ఇది కిడ్నీల సమస్యకు ప్రారంభ లక్షణం కావచ్చు. ఈ లక్షణాలలో ఏవి కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. కిడ్నీ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పూజతో మెదడుకు మేలు..!! అధ్యయనం ఏం చెబుతుందో మీరూ తెలుసుకోండి