High Cholesterol: ఈ భాగాలలో నొప్పి ఉందా..? ఇది ఆ సమస్యకు సంకేతం కావచ్చు!!

అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కండరాల నొప్పి, చేతులు, కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం, చలిగా అనిపించడం కూడా హై కొలెస్ట్రాల్‌కి లక్షణాలు. ఈ లక్షణాలను చిన్న నొప్పులుగా భావించి నిర్లక్ష్యం చేయోదని నిపుణులు చెబుతున్నారు.

New Update
High cholesterol

High cholesterol

అధిక కొలెస్ట్రాల్ అనేది శరీరంలో కొవ్వు లాంటి పదార్థం ఎక్కువగా పేరుకుపోయే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. శరీరానికి కొన్ని ముఖ్యమైన పనుల కోసం కొలెస్ట్రాల్ అవసరం. కానీ దాని స్థాయిలు పెరిగితే.. అది రక్తనాళాల్లో పేరుకుపోయి, రక్తం ప్రవహించకుండా అడ్డుకుంటుంది. సాధారణంగా అధిక కొలెస్ట్రాల్‌కి ఎటువంటి లక్షణాలు ఉండవు. అందుకే దీన్ని తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. అది ప్రాణాలకు ప్రమాదకరంగా మారవచ్చు. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, నరాలు బ్లాక్ అవడం, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలామంది ఈ ప్రారంభ లక్షణాలను చిన్న నొప్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కాళ్ళలో తరచుగా నొప్పి లేదా తిమ్మిరిని గమనించినట్లయితే.. అది అధిక కొలెస్ట్రాల్‌కు ఒక ప్రధాన లక్షణం కావచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి అనిపించడం ..

నడుస్తున్నప్పు డు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాళ్ళలో భారంగా అనిపించడం లేదా కండరాల తిమ్మిరి రావడం దీనికి ఒక స్పష్టమైన సంకేతం. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అలాగే ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి అనిపించడం కూడా అధిక కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉంది. దీనివల్ల ఛాతీలో మంట లేదా బిగుతుగా అనిపించవచ్చు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ఒక హెచ్చరిక. అంతేకాకుండా మెడ, దవడ లేదా భుజాలలో అసాధారణమైన నొప్పి లేదా బిగుతును కూడా గమనించాలి. రక్తప్రసరణ తగ్గినప్పుడు ఈ భాగాలలో అసౌకర్యం కలగవచ్చు.

ఇది కూడా చదవండి: ఇంట్లోనే ఈ చిన్న పరీక్షతో బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించొచ్చు.. ఎలా చేయాలో తెలుసా?

చాలామంది దీనిని కండరాల నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. చేతులు, కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం లేదా చలిగా అనిపించడం కూడా హై కొలెస్ట్రాల్‌కి లక్షణాలు. కొన్నిసార్లు కాళ్ల రంగు నీలంగా మారడం కూడా జరగవచ్చు. తలలో భారంగా అనిపించడం, కళ్ళు తిరగడం, త్వరగా అలసిపోవడం, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను కూడా విస్మరించకూడదు. ఈ లక్షణాలు గమనించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి, కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:శరీరంలో ఈ లోపం ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం.. ఈ లక్షణాలను చెక్ చేసుకోండి

Advertisment
తాజా కథనాలు