/rtv/media/media_files/2025/10/11/tea-2025-10-11-13-13-25.jpg)
Tea
నేటి కాలంలో చాలా మంది రోజును కప్పు వేడి టీ(hot tea)తో ప్రారంభిస్తారు. అయితే పనిలో పడిపోయి చల్లబడిన టీని మళ్లీ వేడి చేసి తాగడం చాలా మందికి అలవాటు. ఇది సాధారణ విషయంగా అనిపించినా ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. పాలు కలిపిన టీని ఎక్కువసేపు నిల్వ చేయడం చాలా ప్రమాదకరం. వేసవిలో ఇది కేవలం 2 నుంచి 3 గంటల్లోనే పాడవుతుంది. నిల్వ ఉంచిన టీని తిరిగి వేడి చేయడం వల్ల కలిగే అనర్థాలు, అది ఎంత త్వరగా పాడవుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఎక్కువసేపు నిల్వ ఉంచితే..
సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా వేగంగా పెరిగి టీలోని పోషకాలను నాశనం చేస్తాయి. మళ్లీ వేడి చేస్తే అంతా సరిపోతుంది అనుకోవడం సరికాదు. పదేపదే వేడి చేయడం వల్ల టీలోని టానిన్లు ఆమ్లంగా (Acidic) మారి ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉండవచ్చు. వీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే 6-8 గంటల వరకు చెడిపోకుండా ఉంటాయి. అయితే ఎంత ఎక్కువసేపు నిల్వ ఉంచితే వాటి రుచి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంత త్వరగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: దగ్గు మందుతో ప్రమాదం.. ప్రతీ దగ్గుకు సిరప్ అవసరం లేదని నిపుణుల సూచనలు
పాడైన టీని సింపుల్‌గా గుర్తించవచ్చు. పుల్లటి లేదా చేదు రుచి, వింత వాసన లేదా టీపై ఒక పొర ఏర్పడటం, రంగు మారడం లేదా నురుగు రావడం, తాగిన తర్వాత గొంతులో మంటగా అనిపించడం వంటి ఈ లక్షణాలలో ఏది కనిపించినా, ఆ టీని వెంటనే పారవేయాలి. ఇలాంటి టీ తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం లేదా ఫుడ్ పాయిజనింగ్ కూడా సంభవించవచ్చు. అంతేకాకుండా పోషకాల నష్టంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి, పోషకాలు నాశనమవుతాయి. తిరిగి వేడి చేసిన టీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను బలహీనపరుస్తుంది. టీని తాజాగా తయారు చేసుకుని. వెంటనే తాగేయడం ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ మిగిలితే 1-2 గంటల్లోపు తాగేయాలి. పదేపదే వేడి చేయడం పూర్తిగా మానుకోవాలి. టీ తాజాగా ఉంటేనే ఆరోగ్యానికి, రుచికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఉదయం ఖాళీ కడుపుతో ఈ గింజల పొడి తీసుకుంటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం