/rtv/media/media_files/2025/10/11/jamun-seeds-powder-2025-10-11-07-29-08.jpg)
Jamun seeds powder
నేరేడు పండును (Jamun) చాలా మంది ఇష్టంగా తింటారు. ముదురు ఊదా రంగులో తీపి-పుల్లని రుచిలో ఉండే ఈ పండు పోషకాల గని. అయితే చాలా మంది నేరేడు పండు తిన్న తర్వాత దాని గింజలను పారేస్తారు. కానీ ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామంది తెలియదు. నేరేడు గింజల పొడిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన గింజల పొడితో కలిగే ప్రయోజనాలు ఏమిటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం:
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు:
నేరేడు గింజల పొడి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో జాములిన్, ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే ఇది మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరం. అంతేకాకుండా జీర్ణ సమస్యలతో బాధపడేవారికి నేరేడు గింజల పొడి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని అస్ట్రింజెంట్ లక్షణాలు జీర్ణవ్యవస్థను ప్రశాంత పరుస్తాయి. ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వలన ఉబ్బరం (Acidity) ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: బరువు తగ్గించుకోండి.. కాలేయ వ్యాధుల బారిన పడకుండా ఉండండి!!
నేరేడులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. హెల్త్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజూ దీని పొడిని తీసుకోవడం ద్వారా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. నేరేడు గింజల పొడిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. ఇది కొవ్వు జీవక్రియకు సహాయపడి, కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. దీని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం అకాల వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం దీనిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: జీర్ణక్రియను మెరుగుపరిచే అద్భుతమైన స్మూతీ.. సులభమైన రెసిపీని ట్రై చేయండి