Cough Syrup: దగ్గు మందుతో ప్రమాదం.. ప్రతీ దగ్గుకు సిరప్ అవసరం లేదని నిపుణుల సూచనలు

దగ్గు అనేది శరీరంలోని రక్షణ యంత్రాంగం. దుమ్ము, ధూళి లేదా ఏదైనా బయటి పదార్థం గొంతు లేదా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు.. శరీరం దానిని బయటకు పంపడానికి దగ్గుతుంది. ప్రతి దగ్గుకు మందు అవసరం లేదు. దగ్గును అణచివేయడానికి సిరప్‌లు పనిచేస్తాయి.

New Update
Cough syrup

Cough syrup

దగ్గు సిరప్‌ల వాడకంపై ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది.  ఈ మధ్యకాలంలో దగ్గు సిరప్ సేవించిన తర్వాత పలువురు పిల్లలు మరణించడం భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ ఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. సాధారణ దగ్గు, జలుబు రాగానే మందు తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిపుణుల ప్రకారం.. దగ్గు అనేది శరీరంలోని రక్షణ యంత్రాంగం (Defense Mechanism). దుమ్ము, ధూళి లేదా ఏదైనా బయటి పదార్థం గొంతు లేదా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు, శరీరం దానిని బయటకు పంపడానికి దగ్గుతుంది. అంటే దగ్గు ఎప్పుడూ హానికరం కాదు. ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

దగ్గు సిరప్‌లలో మత్తు..

దగ్గు ప్రధానంగా రెండు రకాలు ఉంటుంది.  కఫంతో కూడిన దగ్గు (Wet Cough) దీని ద్వారా కఫం లేదా శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.  2వ ది పొడి దగ్గు (Dry Cough) దీనిలో కఫం ఉండదు, కానీ గొంతులో మంట లేదా గరగరగా అనిపిస్తుంది. ప్రతి దగ్గుకు మందు అవసరం లేదు. దగ్గును అణచివేయడానికి సిరప్‌లు పనిచేస్తాయి. అయితే కఫంతో కూడిన దగ్గు ఉన్నప్పుడు సిరప్ వాడితే.. కఫం లోపలే చిక్కుకుని న్యుమోనియా (Pneumonia) లేదా బ్రోన్కైటిస్ (Bronchitis) వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. చాలా దగ్గు సిరప్‌లలో మత్తు కలిగించే ఏజెంట్లు, ఆల్కహాల్ ఉంటాయి. ఇవి పిల్లలకు, వృద్ధులకు సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎముకలతోపాటు ఆరోగ్యానికి విటమిన్ D లోపం పరార్.. ఆశ్చర్యకరమైన లాభాలను తెలుసుకోండి!!

స్వల్ప దగ్గుకు సిరప్ మానేసి.. వేడి నీరు లేదా కషాయం తాగడం, గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం, ఆవిరి పట్టడం వంటి ఇంటి చిట్కాలను పాటించడం ఉత్తమం. అయితే, దగ్గు సాధారణం కానప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.  దగ్గుతున్నప్పుడు రక్తం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీలో నొప్పి, దగ్గు 3 వారాలకు పైగా కొనసాగితే డాక్టర్‌ను సంప్రదించకుండా ఎటువంటి మందులు లేదా దగ్గు సిరప్‌లు వాడకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి:దీపావళికి ఫిట్‌గా కనిపించాలంటే... తక్కువ రోజుల్లో 2-4 కేజీల బరువుని ఇలా తగ్గించుకోండి!!

Advertisment
తాజా కథనాలు