Hot Water Bath: మీరు వేడి నీటితో స్నానం చేస్తారా..?.. అయితే మీకో షాకింగ్ న్యూస్!!

అతి వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి వేడి నీటికి బదులుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మేలని.. దీని ద్వారా చాలా రకాల తీవ్రమైన సమస్యల నుంచి రక్షించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

New Update
Hot Water Bath

Hot Water Bath

చలికాలం రాగానే చాలా మంది వేడి వేడి నీళ్లతో స్నానం(Hot Water Bath) చేయడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే అతి వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. అతి వేడి నీటికి బదులుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మేలని.. దీని ద్వారా చాలా రకాల తీవ్రమైన సమస్యల నుంచి రక్షించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. వేడినీటి స్నానం చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

వేడి నీటి స్నానం వల్ల కలిగే ప్రధాన నష్టాలు:

గోళ్ల సమస్యలు: అతి వేడి నీటి స్నానం వల్ల గోళ్లు బలహీనపడి విరిగిపోవచ్చు. గోళ్లలో ఉండే సహజ నూనెలు (Natural Oils) తగ్గిపోయి, గోళ్లు దెబ్బతింటాయి.

కళ్ళపై ప్రభావం:కళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయకూడదు. వేడి నీటి వల్ల కళ్లలోని తేమ తగ్గిపోయి, దురద, ఎరుపుదనం, నీరు కారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

జుట్టు దెబ్బతినడం:వేడి నీరు జుట్టులోని తేమను తొలగిస్తుంది. దీనివల్ల జుట్టు పొడిగా, గరుకుగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం (Hair Fall) సమస్య కూడా మొదలవ్వవచ్చు.

 ఇది కూడా చదవండి: పసికందును చేతిలో పట్టుకొని ఘోరం.. గుండెల్ని పిండేస్తున్న బస్సు ప్రమాదం దృశ్యాలు!

సంతానోత్పత్తి (Fertility)పై ప్రభావం: అతి వేడి నీటి స్నానం వల్ల సంతానోత్పత్తిపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం హాట్ వాటర్ బాత్ తీసుకుంటే.. అది ఫెర్టిలిటీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

బద్ధకం, సోమరితనం పెరుగుదల: చలికాలంలో రోజూ వేడి నీటితో స్నానం చేసేవారిలో బద్ధకం పెరుగుతుంది. వేడి నీటి స్నానం తర్వాత శరీరం మరింత రిలాక్స్ అవడం వల్ల నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. సోమరితనంతో బాధపడేవారు వేడి నీటి స్నానానికి దూరంగా ఉండటం మంచిది.

చర్మ సమస్యలు: చలికాలంలో చర్మ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం సహజ తేమను కోల్పోయి మొటిమలు, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల సూచన ప్రకారం.. అనారోగ్య సమస్యలను నివారించడానికి.. చలికాలంలో కూడా మితమైన గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమమని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పురుషుల్లో ఈ 4 లక్షణాలు కనిపిస్తే డేంజర్.. క్యాన్సర్ కావొచ్చు..?

Advertisment
తాజా కథనాలు