/rtv/media/media_files/2025/10/14/organ-donation-2025-10-14-12-54-22.jpg)
Organ Donation
ఆధునిక వైద్యంలో అవయవ దానం (Organ Donation) లక్షలాది మంది ప్రాణాలను కాపాడే కీలక మార్గంగా మారింది. అయితే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఎన్ని అవయవాలను దానం చేయగలరనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ.. సరైన వైద్య సహాయంతో వారి గుండె, మూత్రపిండాలు, ఇతర ముఖ్య అవయవాలు కొంతకాలం పనిచేయడం కొనసాగిస్తాయి. ఈ పరిస్థితిలో వైద్యపరంగా తిరిగి జీవింపజేయలేని ఆ వ్యక్తి అవయవాలు, ఎనిమిది కంటే ఎక్కువ జీవితాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. బ్రెయిన్ డెడ్ అయిన దాత ఎనిమిది కంటే ఎక్కువ అవయవాలు, వివిధ కణజాలాలను దానం చేయవచ్చు. ఇది సుమారు ఎనిమిది నుంచి పది మంది ప్రాణాలను కాపాడటంతోపాటు డజన్ల కొద్దీ ఇతరుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. దానం చేయదగిన ముఖ్య అవయవాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఎక్కువ అవయవాల దానం:
గుండె: గుండె వైఫల్యం రోగులకు కొత్త జీవితాన్నిస్తుంది.
మూత్రపిండాలు: ఇద్దరు వేర్వేరు రోగులకు అమర్చవచ్చు.
కాలేయం: రెండు భాగాలుగా విభజించి ఇద్దరికి దానం చేయవచ్చు.
ఊపిరితిత్తులు: విడిగా లేదా కలిపి దానం చేయవచ్చు.
ప్యాంక్రియాస్: తీవ్రమైన మధుమేహ రోగులకు జీవాన్ని అందిస్తుంది.
చిన్న ప్రేగు: అవసరమైన కేసుల్లో అమర్చవచ్చు.
ఇది కూడా చదవండి: యువత ప్రాణాలు తీస్తున్న డేంజర్ అలవాట్లు ఇవే!
అవయవాలతోపాటు కార్నియా, ఎముకలు, చర్మం, గుండె కవాటాలు, రక్తనాళాలు వంటి కణజాలాలను కూడా దానం చేయవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోగులు అవయవాల కొరతతో మరణిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు వస్తే.. వేల సంఖ్యలో ప్రాణాలను రక్షించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 18 ఏళ్లు పైబడిన ఎవరైనా అవయవ దానానికి తమ అంగీకారాన్ని తెలియజేయవచ్చు. ఇందుకోసం దాన పత్రాన్ని నింపి.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. అత్యవసర వైద్య పరిస్థితులలో కుటుంబ అనుమతి కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పార్కిన్సన్ వ్యాధి నాడి పట్టేసిన శాస్త్రవేత్తలు.. ఎలానో మీరూ తెలుసుకోండి!!