Organ Donation: మరణించినా బతికే ఉన్నాడు.. ఫుడ్ డెలివరీ బాయ్ అవయవ దానం!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన 19 ఏళ్ల ఫుడ్ డెలివరీ బాయ్ బిస్వాల్ ప్రభాస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. కాంటినెంటల్ హాస్పిటల్స్ తల్లిదండ్రులకు అవయవదానం గురించి చెప్పగా.. వారు బిస్వాల్ అవయవాలను దానం ఇచ్చేందుకు అంగీకరించారు.