/rtv/media/media_files/2025/10/14/parkinsons-disease-2025-10-14-07-34-57.jpg)
Parkinsons Disease
పార్కిన్సన్స్ వ్యాధి (Parkinsons Disease) మానవ మెదడు కణజాలంలో (Human Brain Tissue) ఎలా మొదలవుతుందో శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా పరిశీలించారు. పరిశోధకులు ASA-PD (Advanced Sensing of Aggregates for Parkinsons Disease) అనే కొత్త సాంకేతికతను ఉపయోగించి.. ఆల్ఫా-సిన్యూక్లిన్ ఒలిగోమర్స్ అని పిలిచే ప్రోటీన్ సమూహాలను గుర్తించారు. ఒలిగోమర్స్ అనేవి పార్కిన్సన్స్ వ్యాధికి ప్రధాన కారణంగా చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే కేవలం కొన్ని నానోమీటర్ల పొడవు ఉండే ఈ సూక్ష్మ సమూహాలు ఇప్పటివరకు మానవ మెదడు కణజాలంలో ప్రత్యక్షంగా కనిపించలేదు. పార్కిన్సన్స్ వ్యాధి మెదడు కణజాలాన్ని ఎలా ప్రేరేపిస్తుంది..? శాస్త్రవేత్తలు మొదటిసారి విజయవంతంగా గమనించిన విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పార్కిన్సన్స్ వ్యాధికి కొత్త చికిత్స:
పరిశోధక బృందం.. ASA-PD సాంకేతికతను అత్యంత సున్నితమైన ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోపీతో కలిపి ఉపయోగించడం ద్వారా.. మరణించిన వారి మెదడు కణజాలంలో మిలియన్ల కొద్దీ ఒలిగోమర్‌లను గుర్తించి విశ్లేషించారు. మానవ మెదడు కణజాలంలో ఈ స్థాయిలో ఒలిగోమర్‌లను మేము నేరుగా పరిశీలించడం ఇదే మొదటిసారి. ఇది పగటిపూట నక్షత్రాలను చూడటం లాంటిదని వైద్యులు అంటున్నారు. ఇది పార్కిన్సన్స్ పరిశోధనలకు కొత్త ద్వారాలు తెరుస్తుందని వారు పేర్కొంటున్నారు. పరిశోధక బృందం పార్కిన్సన్స్ ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల మెదడు కణజాల నమూనాలను పోల్చి చూసింది.
ఇది కూడా చదవండి: చర్మంతో పాటు పాదాలపై ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపమే.. దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి
ఆరోగ్యకరమైన మెదడులలో కూడా ఒలిగోమర్స్ ఉన్నప్పటికీ.. వ్యాధిగ్రస్త మెదడులలోని ఒలిగోమర్‌లు పెద్దవిగా, ప్రకాశవంతంగా, అధిక సంఖ్యలో ఉన్నాయని తేలింది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి పురోగతికి ఒలిగోమర్‌లకు ప్రత్యక్ష సంబంధం ఉందని సూచిస్తుంది. అంతేకాకుండా.. పార్కిన్సన్స్ మెదడులలో మాత్రమే కనిపించే ఒలిగోమర్‌ల ఉపవర్గాన్ని కూడా పరిశోధనలకు కనుగొన్నారు. లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాల ముందు.. ఇవే వ్యాధికి అతి త్వరగా కనిపించే సంకేతాలు కావచ్చు. ఈ కొత్త సాంకేతికతను అల్జీమర్స్, హంటింగ్‌టన్ వంటి ఇతర నాడీ సంబంధిత వ్యాధులకు కూడా వర్తింపజేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారా..? దాని ప్రభావం మీ మూత్ర పిండాలపై పడుతుంది జాగ్రత్త!!