Life style: మీ జుట్టే మీ ఆరోగ్యాన్ని చెబుతుంది. ఎలాగో తెలుసా?
ఈ మధ్య చాలా మంది ఆడపిల్లలను వేధిస్తున్న కామన్ సమస్య హేయిర్ ఫాల్. కాలుష్యం పోషకాహార లోపం కారణంగా ఈ సమస్యకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య చాలా మంది ఆడపిల్లలను వేధిస్తున్న కామన్ సమస్య హేయిర్ ఫాల్. కాలుష్యం పోషకాహార లోపం కారణంగా ఈ సమస్యకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో తేమ వల్ల తల చర్మం సులభంగా మురికి పేరుకుపోతుంది. నూనె రాయడం ఈ సీజన్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా చేయాలి. కనుక వారానికి రెండు సార్లు మాత్రమే గోరు వెచ్చని కొబ్బరి లేదా బాదం నూనెను తల చర్మానికి రాయాలి. కొన్ని గంటల తర్వాత మృదువైన షాంపూతో కడగాలి.
తలకు ఆయిల్ అప్లై చేసి గట్టిగా జడవేస్తే జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఆయిల్ అప్లై చేసి రాత్రంతా ఉండకూడదు. దీనివల్ల జుట్టు చిట్లిపోతుందని చెబుతున్నారు. మీరు తలకు స్నానం చేసే ముందు నూనె రాస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
క్రమం తప్పకుండా జుట్టులో బిగుతుగా ఉండే పోనీటైల్ను వేసుకుంటే జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. జుట్టును లాగడం మూలాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది జుట్టు రాలడానికి దారితీసే కుదుళ్లను దెబ్బతీస్తుంది. టైట్ పోనీటైల్ కూడా జుట్టు రాలడాన్ని పెంచుతుంది.
జుట్టు విపరీతంగా రాలుతుంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే థైరాయిడ్ సమస్య తీవ్రమై హైపో థైరాయిడిజానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అద్భుతమైన జుట్టు రాలడాన్ని తగ్గించడంలో అశ్వగంధ ఒకటి. దీనిలో ఉండే ఆయుర్వేద లక్షణాలు థైరాయిడ్ హార్మోన్, టెస్టోస్టెరాన్, సెక్స్ హార్మోన్, శారీరక, మానసిక, ఒత్తిడి వంటి సమస్యలన్నింటిని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఈ మధ్య చాలా మందిలో జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. పోషకాహార లోపం, జీవనశైలి దీనికి ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి. అయితే జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి ఆహారంలో నల్ల నువ్వులు, చియా, గుమ్మడికాయ వంటి విత్తనాలను చేర్చుకోవడం ప్రయోజనకరమని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలడం అనే సమస్యతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా సమయంలో గుడ్డు-ఆలివ్ నూనె, ఉసిరికాయ, బృంగరాజ్, రోజూ తలకు మసాజ్ వంటివి చేయడం వల్ల సమస్య తగ్గి.. జుట్టు రాలడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.