Lemon: నిమ్మకాయను ప్రతి దానిలో కలిపి తినకూడదు..ఎందుకో తెలుసా..?

నిమ్మకాయను ప్రతి పదార్థంతో కలిపి తినడం మంచిది కాదు. పాలు, పాల ఉత్పత్తులు, మామిడి, అరటిపండు, ఆపిల్, పుచ్చకాయ, టమోటా, చింతపండు, వెనిగర్, ఇంగువ, గరం మసాలాలతో నిమ్మరసాన్ని కలిపి తింటే కడుపులో ఆమ్లత్వం పెరిగి మంట, ఉబ్బరం వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది.

New Update
Lemon

Lemon

Lemon: నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి మేలు చేసే పండు. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటంతో శరీరానికి ఉత్తేజం, దాహాన్ని తీర్చే లక్షణాలు కలిగి ఉంటాయి. వేసవిలో నిమ్మకాయ నీటిని తాగడం వల్ల దాహం తీరుతుందనే కాదు.. శరీరానికి అవసరమైన ఐయాన్లు కూడా అందుతాయి. తినే ఆహారానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే ఆహారం రుచి రెట్టింపు అవుతుంది. కానీ నిమ్మకాయను ప్రతి పదార్థంతో కలిపి తినడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యాన్ని హానిచేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ ఎందుకు తినకూడదో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆరోగ్యానికి మంచిది కాదు:

పాలు, పాల ఉత్పత్తులతో నిమ్మకాయను కలిపి తినకూడదు. నిమ్మకాయలో ఎక్కువ సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది పాలలోని ప్రోటీన్‌ను గడ్డకట్టేలా చేస్తుంది. ఇది జీర్ణక్రియ, గ్యాస్, కడుపులో మంట, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. నిమ్మకాయను తీపి పండ్లతో కలిపి తినడం కూడా మంచిది కాదు. మామిడి, అరటిపండు, ఆపిల్, పుచ్చకాయ వంటి పండ్లతో నిమ్మరసాన్ని కలిపితే కడుపులో ఆమ్లత్వం పెరిగి మంట, ఉబ్బరం వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది. నిమ్మకాయను ఇతర పుల్ల పదార్థాలైన టమోటా, చింతపండు, వెనిగర్ వంటిల్లో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వాటిలో ఆమ్లం అధికంగా ఉండటం వలన నిమ్మకాయతో కలిపితే ఆమ్లాన్ని అధికంగా తీసుకుని జీర్ణవ్యవస్థపై ఒత్తిడి, కడుపులో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. 

ఇది కూడా చదవండి: ఇంటిని అలంకరించే మొక్కల మధ్య దాగి ఉన్న ప్రమాదం

గుడ్డు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాల్లో నిమ్మరసం కలపడం వల్ల ప్రోటీన్ నాశనం అవుతుంది. ఇది ఆహారంలోని పోషక విలువను తగ్గిస్తుంది. నిమ్మకాయ రుచి గుడ్డు రుచిని మించిపోతుంది. తద్వారా వంటకం అసహజంగా మారుతుంది. ఇంగువ, గరం మసాలాలతో కలిపి నిమ్మకాయను తింటే కడుపు సమస్యలు కలగవచ్చు. వేడిగా ఉండటంతో, నిమ్మకాయ ఆమ్లత్వంతో కలిపి తినడం వల్ల శరీరంలో గ్యాస్, మంట, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. నిమ్మకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రతి పదార్థంతో కలిపి తినవద్దని నిపుణులు 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: డీప్ ఫ్రై చేసిన ఆహారం తక్కువ హానికరంగా ఉండాలంటే వీటి వాడకమే మంచిది

( food | milk | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు