Health Tips: 1,2 లేదా 4.. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి..?

మూడు పూటలా సమతుల్య ఆహారం తీసుకోవడం వలన శరీరానికి ప్రొటీన్, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు అందుతాయి. చిన్న చిన్న భోజనాలు తీసుకోవడం వలన జీవక్రియ చురుకుగా ఉంటుంది, శరీరానికి నిరంతరం శక్తి అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
food

food

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లను(Food Habbits) పాటించడం అత్యవసరం. అయితే రోజుకు ఎన్నిసార్లు ఆహారం తీసుకోవడం సరైన పద్ధతి. ఒక పూట తింటే సరిపోతుందా? లేక నాలుగు సార్లు తినడం మంచిదా? అనే ప్రశ్న చాలా మందిలో తరచుగా వస్తుంది. ఆరోగ్యకరమైన, సమతుల్య విధానంగా సాధారణంగా రోజుకు రెండు లేదా మూడు సార్లు భోజనం చేయడం మంచిదంటారు. ఈ పద్ధతిలో అల్పాహారం (Breakfast), మధ్యాహ్న భోజనం (Lunch), రాత్రి భోజనం (Dinner) ఉంటాయి. మూడు పూటలా సమతుల్య ఆహారం తీసుకోవడం వలన శరీరానికి ప్రొటీన్, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు అందుతాయి. ఇది పూర్తి పోషణను అందించి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఈ విషయంలో ఉన్న భిన్నమైన విధానాలు, ఏ పద్ధతి ఎవరికి ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యంగా ఉండాలంటే..

కొందరికి ముఖ్యంగా ఎడతెగని ఉపవాసం (Intermittent Fasting) పాటించే వారికి రోజుకు ఒకసారి తినడం సరిపోవచ్చు. ఈ పద్ధతి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఇది అందరికీ సురక్షితం కాదు. ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు లేదా మధుమేహం ఉన్నవారు ఈ విధానాన్ని పాటించడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చిన్న మొత్తంలో తరచుగా, రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు తినడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు తరచుగా ఆకలి వేస్తే. ఈ పద్ధతి అనుసరించవచ్చు. 

ఇది కూడా చదవండి: ఉదయం ఖాళీ కడుపుతో ఈ గింజల పొడి తీసుకుంటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

చిన్న చిన్న భోజనాలు తీసుకోవడం వలన జీవక్రియ (Metabolism) చురుకుగా ఉంటుంది, శరీరానికి నిరంతరం శక్తి అందుతుంది. అయితే ఈ పద్ధతిలో తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా.. తక్కువ కేలరీలు కలిగి ఉండటం ముఖ్యం. జంక్ ఫుడ్, చక్కెర స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనం కంటే హాని జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఎన్నిసార్లు తింటారు అనేది జీవనశైలి, ఆరోగ్య లక్ష్యాలు, ఆకలిని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా మందికి మూడు పూటలా సమతుల్య భోజనం ఉత్తమమైన విధానం కాగా.. తరచుగా ఆకలిగా ఉంటే చిన్న చిన్న భాగాలుగా 4-5 సార్లు తినడం మంచిది. ఆరోగ్య పరిస్థితిని బట్టి సరైన ఆహార పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: పొద్దున్నే బ్రేక్ ఫాస్టులో ఇవి లాగిస్తే ఆయుష్షు, మెదడు సేఫ్‌

Advertisment
తాజా కథనాలు