/rtv/media/media_files/2025/08/10/yellow-teeth-2025-08-10-12-28-27.jpg)
Yellow Teeth
Yellow Teeth: మంచి చిరునవ్వు (smile) ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే పసుపు పచ్చని పళ్ళు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. దంతాలను తెల్లగా మార్చుకోవడానికి మార్కెట్లో లభించే ఖరీదైన, రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే దంతాలను మెరిసేలా చేసుకోవచ్చు. దీనితో మీ చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇక ఎవరితో మాట్లాడాలన్నా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ గృహ చిట్కాలు సురక్షితమైనవి, చవకైనవి మరియు ప్రభావవంతమైనవి. వాటి గురించి కొన్ని విషయాలు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పసుపు పచ్చని పళ్ళను తొలగించే చిట్కాలు:
సాధారణ ఉప్పు సహజమైన యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. కొద్దిగా ఉప్పును మీ వేళ్ళపై తీసుకుని నేరుగా దంతాలపై రుద్దండి. ఇది దంతాలపై పేరుకుపోయిన మురికిని మరియు పసుపు పచ్చని మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వలన దంతాలు మెరుస్తూ తెల్లగా మారతాయి. ఉప్పు మరియు ఆవనూనె ఈ రెండింటి కలయికతో ఒక ఆయుర్వేద పేస్ట్ తయారవుతుంది. ఒక చిటికెడు ఉప్పులో మూడు చుక్కల ఆవనూనె (mustard oil) కలిపి బ్రష్ సహాయంతో దంతాలను తోముకోవచ్చు. ఈ మిశ్రమం దంతాలను తెల్లగా చేయడమే కాకుండా చిగుళ్ళను (gums) కూడా బలపరుస్తుంది. బేకింగ్ సోడా సహజంగా శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది. అర చెంచా ఉప్పు మరియు అర చెంచా బేకింగ్ సోడాను కలిపి కొద్దిగా నీటితో పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు బ్రష్ లాగా వాడండి. ఇది పళ్ళ పసుపుదనాన్ని తగ్గించి మెరుపును పెంచుతుంది.
ఇది కూడా చదవండి: మంచి నిద్ర కావాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.!!
ఉప్పులో నిమ్మరసం (lemon juice) కలిపితే అది ఒక శక్తివంతమైన శుభ్రపరిచే పేస్ట్ లాగా మారుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం (citric acid) దంతాల పైపొరను శుభ్రం చేసి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే దీనిని వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి. ఎందుకంటే అధికంగా వాడితే దంతాలకు నష్టం కలగవచ్చు. పసుపు పచ్చని పళ్ళు అనేక సమస్యలకు కారణమవుతాయి. పసుపు పచ్చగా మారడానికి కారణాలు ఏవైనా పళ్ళ రంగు మీ నవ్వును ప్రభావితం చేస్తుంది. పసుపు రంగు పళ్ళ వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ప్రజలతో మాట్లాడటానికి వెనకడుగు వేయడం, నవ్వేటప్పుడు ఇబ్బంది పడటం వంటి సమస్యలు వస్తాయి. మీ పళ్ళు పసుపు రంగులోకి మారడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. తర్వాత దంత వైద్యుని సలహా ప్రకారం పళ్ళను తెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా.. ఇంటి చిట్కాలతో అయినా దంతాలను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు మొక్కజొన్న కంకికి దూరంగా ఉంటే బెటర్