/rtv/media/media_files/2025/08/10/corn-2025-08-10-06-59-41.jpg)
Corn
Corn: వర్షాకాలంలో వేడి వేడిగా ఉండే మొక్కజొన్న కంకి తినడం చాలామందికి ఇష్టం. ఉప్పు, నిమ్మకాయతో కాల్చిన మొక్కజొన్న రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. అయితే మొక్కజొన్నను తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అయితే.. మొక్కజొన్న కంకి అందరికీ మంచిది కాకపోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఏ ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినడం తగ్గించాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఈ సమస్యలు ఉన్నవారు భుట్టాకు దూరం..
మొక్కజొన్నలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవచ్చు. అందుకే మధుమేహ రోగులు దీనిని పరిమితంగా తినాలి. మొక్కజొన్నలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ.. కడుపు ఉబ్బరం, గ్యాస్, లేదా IBS వంటి సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు కలిగించవచ్చు. అంతేకాకుండా..అలెర్జీలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. కొంతమందికి మొక్కజొన్న వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించి తినడం మంచిదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: శరీరంలో వచ్చే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు..!!
బరువు తగ్గాలనుకునేవారు ఇది చాలా మంచిది. మొక్కజొన్నలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా తింటే వారి డైట్ దెబ్బతినవచ్చు. ఇది కేలరీల స్థాయిని పెంచి, బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. కిడ్నీ రోగులు మొక్కజొన్న మంచిది కాదు. ఎందుకంటే ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది హానికరం. ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడి పెంచుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు మొక్కజొన్న తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఉప్పు లేదా వెన్నతో తింటే గుండె రోగులకు ప్రమాదకరం. అదనపు సోడియం, కొవ్వు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మొక్కజొన్న కంకిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మంచి నిద్ర కావాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.!!