Women Obesity: మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం వెనుక దాగున్న వాస్తవాలు ఇవే!!

స్త్రీల శరీరం యుక్త వయస్సు నుంచి రుతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ వంటి అనేక హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుంది. ఈ హార్మోన్ల ప్రభావం వలన కొవ్వు, ముఖ్యంగా పొట్ట, తొడలు, తుంటి భాగాలలో పేరుకుపోతుంది. ఈ సహజమైన జీవసంబంధ మార్పులు బరువు పెరుగుతారు.

New Update
Women Obesity

Women Obesity

నేటి కాలంలో ఊబకాయం కేవలం వ్యక్తిగత సమస్య కాకుండా.. సామాజిక ఆందోళనగా మారుతోంది. మన దేశంలో ప్రతి రెండవ మహిళ ఈ కనిపించని భారంతో పోరాడుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పురుషుల్లో 22.9% మంది అధిక బరువుతో ఉంటే, మహిళల్లో ఈ సంఖ్య 24%గా ఉంది. ముఖ్యంగా ఉదర భాగంలో కొవ్వు (Central Obesity) విషయంలో స్త్రీలలో 40% మంది ఊబకాయం వర్గంలో ఉండగా... పురుషుల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ వ్యత్యాసానికి కారణం కేవలం ఆహారం మాత్రమే కాదు.. మహిళల జీవనశైలి, శారీరక శ్రమకు సంబంధించిన అపోహలే ప్రధాన కారణాలని చెబుతున్నారు. భారతీయ మహిళల్లో ఊబకాయం ఎందుకు ఎక్కువగా పెరుగుతోంది..?  శరీర బరువు ఎలా తగ్గించుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఊబకాయం తినడం వల్ల రాదు..

స్త్రీల శరీరం యుక్త వయస్సు నుంచి రుతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ వంటి అనేక హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుంది. ఈ హార్మోన్ల ప్రభావం వలన కొవ్వు, ముఖ్యంగా పొట్ట, తొడలు, తుంటి భాగాలలో పేరుకుపోతుంది. ఈ సహజమైన జీవసంబంధ మార్పులు బరువు పెరగడానికి దోహదపడతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా భారతీయ మహిళలు ఇంటి పనులకే పరిమితమై, రోజంతా కుటుంబానికి సేవ చేయడంలో గడుపుతారు. వంటగదిని ఊడ్చడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి వాటిని వ్యాయామంగా వారు భావిస్తారు. కానీ ఇవి కేవలం శారీరక అలసట మాత్రమే.. నిజమైన వ్యాయామం కాదు. ఇంటి పనులలో శరీరం నిరంతరం చలనం కోల్పోయి, నిశ్చలంగా ఉంటుంది. ఈ నిశ్చలత్వం జీవక్రియ (Metabolism)ను నెమ్మదింపజేసి, బరువు పెరగడానికి దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: డ్రై ఫ్రూట్స్ ఒరిజినలా? కాదా? ఈ సింపుల్ టెస్ట్‌తో ఇట్టే గుర్తు పట్టండి!!

 ఆహారం విషయంలోనూ మహిళలు తమ పట్ల శ్రద్ధ చూపడం లేదు. వారు తమకు ఎంత ప్రోటీన్, ఫైబర్ అవసరమో ఆలోచించరు. కుటుంబ సభ్యుల కడుపు నింపే క్రమంలో.. మిగిలిపోయిన ఆహారం తినడం, పిల్లల ప్లేట్లలోంచి తీసుకోవడం, లేదా తమకు పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేయడం చేస్తారు. ఈ స్వ-త్యాగం భారతీయ సంస్కృతిలో ఒక సద్గుణంగా చెబుతారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పురుషులు బయట పని చేస్తూ.. నడవడం, పరిగెత్తడం, జిమ్‌కి వెళ్లడం వంటివి చేయడం వల్ల చురుకుగా ఉంటారు. కానీ మహిళల శ్రమ ఇంటి నాలుగు గోడలకే పరిమితమై.. శక్తిని హరిస్తుంది తప్ప, ఆరోగ్యాన్ని ఇవ్వడం లేదు. ఈ అలవాట్లను మార్చుకొని.. నిజమైన వ్యాయామానికి సమయాన్ని కేటాయించడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రాత్రి పూట పదే పదే దాహం వేస్తోందా..? అయితే.. మీకు ఆ డేంజర్ వ్యాధి ముప్పు ఉన్నటే!!

Advertisment
తాజా కథనాలు