/rtv/media/media_files/2025/11/20/ashwagandha-2025-11-20-09-12-57.jpg)
Ashwagandha
ఆధునిక జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో దాదాపు 74 శాతం మంది ఒత్తిడితో... 88 శాతం మంది ఆందోళనతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతిలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలున్న అశ్వగంధ (Ashwagandha) వంటి మూలికలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అశ్వగంధను సరైన విధంగా.. సరైన మోతాదులో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక టీస్పూన్ అశ్వగంధ తీసుకోవడం వల్ల అనేక అనూహ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచించారు. అశ్వగంధతో అద్భుత ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అశ్వగంధతో లభించే ముఖ్య ప్రయోజనాలు:
అశ్వగంధలో ఉండే సిటోఇండోసైడ్స్ (Sitoindosides), అసిల్‌స్టెరైల్‌గ్లైకోసైడ్స్ (Acylsterylglycosides) వంటి పదార్థాలు అడాప్టోజెనిక్ (Adaptogenic) ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను గణనీయంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా ఆందోళన తరచుగా నిద్రలేమికి దారితీస్తుంది. అశ్వగంధ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నిద్రలేమి సమస్యను ఎదుర్కోవడానికి ఉపకరిస్తుంది. పురుషులలో ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచి, వీర్య కణాల సంఖ్య, చలనశీలతను మెరుగుపరుస్తుంది. మహిళలలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడం, పునరుత్పత్తి అవయవాల పనితీరును ప్రోత్సహించడం ద్వారా సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడవచ్చు.
ఇది కూడా చదవండి: అజ్వైన్ టీ ఎప్పుడు తాగాలి..? తాగితే కలిగే ప్రయోజనాల గురించి డైటీషియన్ ఏం చెబుతున్నారో తెలుసుకోండి!!
గర్భస్రావం చరిత్ర ఉన్న మహిళల్లో గర్భాశయాన్ని బలోపేతం చేస్తుంది. అశ్వగంధ కండరాల బలాన్ని నిర్వహించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది కండరాల నిర్మాణానికి, బలాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చూపించాయి. అశ్వగంధ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. అశ్వగంధను తీసుకునే ముందు సరైన మోతాదు, వినియోగ పద్ధతి కోసం తప్పనిసరిగా ఆయుర్వేద వైద్య నిపుణుడిని సంప్రదించాలని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే మలబద్ధకం మటుమాయం.. కడుపుకు ఉపశమనం..!
Follow Us