/rtv/media/media_files/2025/06/19/non-stick-pan-2025-06-19-18-02-45.jpg)
Non Stick Pan
Non Stick Pan: ఈ రోజుల్లో నాన్-స్టిక్ పాత్రలు ప్రతి వంటగదిలో ముఖ్యమైన భాగంగా మారాయి. వాటిని ఉపయోగించడం వల్ల వంట సులభతరం, శుభ్రపరచడం కూడా త్వరగా అవుతుంది. కానీ నాన్-స్టిక్ పాత్రల వాడకం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయని చాలామందికి తెలియదు. కాలక్రమేణా.. నాన్-స్టిక్ వంట సామానుపై పూత తొలగిపోతుంది. దీని వలన అది తక్కువ ప్రభావవంతంగా మారుతుంది, ఆహారంలోకి ముక్కలు చేరుతాయి. నాన్-స్టిక్ పాత్రలను నిరంతరం ఉపయోగించడం వల్ల కలిగే ఆనారోగ్య సమస్యల గురించి, నాన్-స్టిక్ పాత్రల ప్రతికూలతలను గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నాన్ స్టిక్ వంట సామాగ్రి ప్రతికూలతలు:
నాన్-స్టిక్ పాత్రలలో పెర్ఫ్లో రోక్టానోయిక్ యాసిడ్ (PFOA), పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ ( PTFE) వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి హానికరమైన పొగలను విడుదల చేస్తాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. నాన్-స్టిక్ వంట సామాగ్రిని అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయడం వల్ల దాని పూత దెబ్బతింటుంది. దాని నాణ్యత తగ్గిపోతుంది, అది త్వరగా పాడైపోతుంది.
ఆరోగ్య సంబంధిత సమస్యలు:
కొన్ని పరిశోధనల ప్రకారం.. నాన్-స్టిక్ పాత్రల తయారీలో ఉపయోగించే రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. నాన్‌స్టిక్ వంట సామాగ్రి చాలా వేడిగా మారినప్పుడు.. విడుదలయ్యే పొగలు తలనొప్పి, జ్వరం, బలహీనతతో సహా టెఫ్లాన్ ఫ్లూ లేదా పాలిమర్ ఫ్యూమ్ జ్వరం లాంటి లక్షణాలను కలిగిస్తాయి. మీరు నాన్-స్టిక్ ఉపయోగిస్తున్నప్పటికీ.. సురక్షితమైన వంట కోసం సరైన ఉష్ణోగ్రతను ఎంచుకోవాలి. దెబ్బతిన్న నాన్-స్టిక్ పాత్రలను వెంటనే మార్చాలి. అలాగే అల్యూమినియం పాత్రలను వాడకుండా ఉండాలి. స్టీల్ లేదా ఇనుప పాత్రలను వండిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ 9 పనులు చేస్తే దోమలు పరార్.. తప్పక తెలుసుకోండి!
( home-tips | home tips in telugu | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)
ఇది కూడా చదవండి: జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఇవి తాగండి