Depression: పురుషులు Vs స్త్రీలు.. డిప్రెషన్కు గురైతే ఎవరు ఎక్కువగా అరుస్తారో తెలుసా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పురుషులతో పోలిస్తే మహిళలు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు రెట్టింపు ఉంది. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ల మార్పులు. రుతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ సమయంలో వచ్చే మార్పులు మహిళల మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి.

New Update
Depression

Depression

డిప్రెషన్ అనేది ఒక వ్యక్తిని అంతర్గతంగా దెబ్బతీసే తీవ్రమైన మానసిక సమస్య. అందుకే దీనిని నిశ్శబ్ద వ్యాధి (silent disease) అని కూడా అంటారు. అయితే ఈ వ్యాధి లింగ భేదాలను చూపుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. స్త్రీలు, పురుషుల మధ్య డిప్రెషన్ విషయంలో చాలా లోతైన తేడాలు ఉన్నాయని ఇటీవల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మహిళలు తమ భావోద్వేగాలను (Emotions) బహిరంగంగా వ్యక్తపరుస్తుంటే.. పురుషులు తరచుగా మౌనంగా బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వ్యత్యాసం కేవలం ప్రవర్తనకు మాత్రమే పరిమితం కాకుండా.. శరీరం, మనస్సుపై కూడా లోతైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధికి లింగ భేదాలు ఎందుకు కనిపిస్తాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మహిళలకు డిప్రెషన్ వచ్చే అవకాశం రెట్టింపు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పురుషులతో పోలిస్తే మహిళలు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు రెట్టింపు ఉంది. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ల మార్పులు (Hormonal changes). రుతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్ సమయంలో వచ్చే మార్పులు మహిళల మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. అదనంగా, సమాజం, కుటుంబం నుంచి మహిళలపై ఉండే ఒత్తిళ్లు కూడా వారిని మానసికంగా మరింత సున్నితంగా మారుస్తాయి. మరో నివేదిక ప్రకారం.. పురుషులలో డిప్రెషన్ తరచుగా దాగి ఉంటుంది. పురుషులు బలవంతులుగా ఉండాలనే సామాజిక ఒత్తిడి కారణంగా.. వారు తమ సమస్యను అంగీకరించడానికి ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో.. పురుషులు తమ బాధను మాటల్లో వ్యక్తం చేయకుండా.. మౌనం, చిరాకు, కోపం, నిద్ర లేమి లేదా మద్యపానం, మత్తుమందుల వాడకం వంటి లక్షణాలను చూపుతారు. దీనికి భిన్నంగా.. మహిళలు సాధారణంగా తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఏడవడం లేదా డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా తమ భావోద్వేగాలను పంచుకుంటారు.

 ఇది కూడా చదవండి: మీరు వేడి నీటితో స్నానం చేస్తారా..?.. అయితే మీకో షాకింగ్ న్యూస్!!

డిప్రెషన్ లక్షణాలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఒత్తిడి లేదా ఒంటరితనం రూపంలో ఒకే విధంగా కనిపించినప్పటికీ... వారు స్పందించే విధానంలో తేడా ఉంటుంది. మనస్తత్వవేత్తల (Psychologists) ప్రకారం.. మహిళల మెదడులో సెరోటోనిన్ (Serotonin) స్థాయిలు మరింత సున్నితంగా ఉంటాయి. దీనివల్ల వారు భావోద్వేగాలను మరింత తీవ్రంగా అనుభవిస్తారు. మరోవైపు పురుషుల మెదడు సమస్యలను పరిష్కరించడంపై (problem-solving) ఎక్కువగా దృష్టి పెడుతుంది. అందువల్ల వారు తమ భావోద్వేగాలను అణచివేయడానికి, ఆచరణాత్మకంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. దీర్ఘకాలంలో ఈ అణచివేత డిప్రెషన్‌ను మరింత తీవ్రతరం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: తినడానికి ముందు ఈ చిట్కా పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య దరి చేరదు

Advertisment
తాజా కథనాలు