/rtv/media/media_files/2025/08/17/coconut-oil-2025-08-17-06-41-43.jpg)
Coconut Oil
కొబ్బరి నూనె ఆరోగ్యానికి, అందానికి అద్భుతమైన వరం. ఇది గది ఉష్ణోగ్రత వద్ద గట్టిగా ఉంటుంది.. కానీ వేడి చేస్తే కరుగుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యంగా మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం త్వరగా శక్తిగా మార్చుకోవడానికి సహాయపడతాయి. చర్మ సంరక్షణ, జుట్టు పోషణకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె సంప్రదాయంలో, ఆయుర్వేదంలో కూడా ఒక భాగం. అయితే వర్షాకాలం చల్లదనం, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. కానీ అదే సమయంలో అధిక తేమ, ఉక్కపోత కారణంగా చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. దద్దుర్లు, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు ఈ కాలంలో సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నూనెను చర్మానికి వాడటం మంచిదేనా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఈ విషయంలో వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వర్షాకాలంలో కొబ్బరి నూనె చర్మానికి..
కొబ్బరి నూనెలో విటమిన్ E, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే.. వర్షాకాలంలో అధిక తేమ కారణంగా చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. ఈ సమయంలో కొబ్బరి నూనె వాడటం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. చర్మం పొడిగా లేదా సాధారణంగా ఉంటే.. వర్షాకాలంలో కొబ్బరి నూనెను కొద్దిగా వాడటం వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. కానీ మీది జిడ్డు చర్మం అయితే కొబ్బరి నూనెను వాడకపోవడం మంచిది. వర్షాకాలంలో పగటిపూట కొబ్బరి నూనె వాడటం మానుకోవాలి. ఎందుకంటే అధిక తేమ, దుమ్ము, మురికి కారణంగా చర్మంపై నూనె పేరుకుపోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవడం వల్ల చర్మానికి విశ్రాంతి లభిస్తుంది, లోతైన తేమ అందుతుంది.
ఇది కూడా చదవండి: ఒకే రకమైన అల్పాహారం బోర్ కొట్టిందా..? ఈ ఆరోగ్యకరమైన వాటిని తిని చూడండి..!!
వర్షాకాలంలో చర్మంపై చెమట, మురికి ఎక్కువగా పేరుకుపోతాయి. కాబట్టి కొబ్బరి నూనెను రాసుకునే ముందు ముఖాన్ని బాగా కడగాలి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు చర్మాన్ని బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తాయి. ఇది చర్మాన్ని పొడిగా ఉండకుండా కాపాడుతుంది. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని బాగు చేయడంలో తోడ్పడుతుంది. అయితే మీకు మొటిమల సమస్య ఉన్నట్లయితే.. కొబ్బరి నూనె వాడకం మానుకోవాలి. కొత్త ప్రొడక్ట్ వాడే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. వర్షాకాలంలో భారీ నూనెలను వాడటం వల్ల చర్మం జిడ్డుగా మారి అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పొట్టు బాదం సురక్షితమేనా..? నిపుణుల సలహాలు కూడా తెలుసుకోండి!!