/rtv/media/media_files/2025/08/06/mother-milk-2025-08-06-09-52-47.jpg)
Mother Milk
Mother Milk: నేటి కాలంలో సంతానోత్పత్తిపై అనేక సమస్యలు వస్తున్నాయి. సంతానోత్పత్తిపై ప్రభావం చూపే లక్షణాలు అనేవి మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఉంటాయి. అలాగే వాటికి అనేక కారణాలు ఉంటాయి. అయితే శిశువు పుట్టిన తర్వాత మహిళల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరికీ బ్రెస్ట్‌ఫీడింగ్ చాలా ముఖ్యం. కానీ ఈ ప్రక్రియ మహిళల హార్మోన్ల స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే చాలా మంది మహిళలు పిల్లలకు పాలు ఇస్తున్నంత కాలం గర్భం దాల్చలేమని అనుకుంటారు. ఇది నిజమేనా..? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రెగ్నెన్సీని నిరోధించడంలో కొంత వరకు సహాయపడుతుంది. కానీ అది నూటికి నూరు శాతం గ్యారెంటీ ఇవ్వదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందా అనే కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటే..
ప్రసవం తర్వాత కనీసం మూడు నెలల వరకు మహిళల శరీరంలో అండాశయం (ఓవ్యూలేషన్) జరగదని.. దీనివల్ల పీరియడ్స్ రావు అని తెలిపారు. ఈ కారణంగానే గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే.. ఒకసారి పీరియడ్స్ సాధారణంగా ప్రారంభమైన తర్వాత మహిళలు మళ్లీ గర్భం దాల్చవచ్చు. రెండు గర్భాల మధ్య కనీసం మూడు సంవత్సరాల గ్యాప్ ఉండాలని వైద్యులు సూచించారు. బ్రెస్ట్‌ఫీడింగ్, ఓవ్యూలేషన్ మధ్య ఉన్న సంబంధం ఉంది. శిశువు పుట్టిన తర్వాత మహిళల శరీరంలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ పాలు ఉత్పత్తి చేయడానికి సహాయపడటంతోపాటు కొంత కాలం వరకు ఓవ్యూలేషన్‌ను నిరోధిస్తుంది.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో రోజంతా బూట్లు ధరిస్తారా..? మీకు ఈ వ్యాధి రావచ్చు..!!
దీనివల్ల మహిళలకు పీరియడ్స్ రావు. అయితే.. ఇది శాశ్వత పరిష్కారం కాదు. కొంతమంది మహిళల్లో ఈ ప్రభావం 3-6 నెలల వరకు ఉండవచ్చు, మరికొందరిలో త్వరగా పీరియడ్స్ తిరిగి రావచ్చు. అందుకే.. గర్భం రాకుండా ఉండటానికి వైద్యుడిని సంప్రదించి గర్భనిరోధక సాధనాలను ఉపయోగించడం ముఖ్యం. రెండు గర్భాల మధ్య సరైన గ్యాప్ ఉంటే తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. త్వరగా గర్భం దాల్చడం వల్ల తల్లి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. బిడ్డకు పోషకాల లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బ్రెస్ట్‌ఫీడింగ్ ఫెర్టిలిటీపై ప్రభావం చూపినప్పటికీ ఇది శాశ్వతమైనది కాదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పిస్తాపప్పు విటమిన్ లోపాన్ని తొలగిస్తుందా..? తినడానికి సరైన సమయం తెలుసా..!!