Health: ఈ చిట్కాలు పాటించి చూడండి.. తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి..!
మాతృత్వం అవ్వడం మహిళకు దేవుడిచ్చిన గొప్ప వరం. బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు మాసాలైన తల్లి బిడ్డకు పాలివ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల, ఇంగ్లీషు మందుల వాడకం, రసాయన ఆహార పదార్థాలు తినటం వల్ల తల్లిపాలు చాలా వరకు తగ్గిపోయాయి.