/rtv/media/media_files/2025/08/12/sleep-breathing-2025-08-12-17-27-47.jpg)
Sleep Breathing
శంఖం అనేది హిందూ మతంలో పవిత్రమైన వస్తువు. దీనిని పూజ, శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శంఖాన్ని ఊదడం అనేది కేవలం ఒక ధ్వనిని సృష్టించడం మాత్రమే కాదు.. ఇది ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. శంఖం ఊదడం వల్ల వచ్చే శబ్దం ఓంకార నాదానికి దగ్గరగా ఉంటుందని చెబుతారు. ఈ శబ్దం పరిసరాల్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి.. సానుకూల శక్తిని నింపుతుంది. అంతేకాకుండా.. శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ బలోపేతం అవుతాయి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే శంఖారావం అనేది పవిత్రత.. విజయానికి సంకేతంగా చెబుతారు. తాజాగా శంఖంపై ఓ సర్వేలో నిద్ర సమస్యలు తగ్గిస్తుందని తేలింది. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వినూత్న పరిష్కారం..
నేటి వేగవంతమైన.. ఒత్తిడితో కూడిన జీవనశైలి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. అందులో ఒకటి స్లీప్ అప్నియా. ఇది నిద్రలో శ్వాస తీసుకోవడం ఆగిపోయే ఒక తీవ్రమైన రుగ్మత. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టక.. పగటిపూట అలసట, చిరాకు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా.. దీనికి CPAP మెషిన్ ఉపయోగిస్తారు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్నది. అయితే తాజా అధ్యయనంలో స్లీప్ అప్నియా సమస్యకు ఒక కొత్త.. సులభమైన పరిష్కారం దొరికింది. అదే శంఖం ఊదడం.. భారతీయ సంస్కృతిలో శంఖం పవిత్రమైనదిగా చెబుతారు. ఒక పరిశోధనలో 30 మంది రోగులపై నిర్వహించిన అధ్యయనంలో శంఖం ఊదిన వారిలో నిద్ర నాణ్యత 34% మెరుగుపడిందని.. పగటిపూట నిద్రలేమి తగ్గిందని.. ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయని తేలింది.
ఇది కూడా చదవండి:నిద్రలో నోరు తెరిచి ఉంటే జాగ్రత్త.. ఈ అలవాటు ఆనారోగ్య సమస్యలకు సంకేతం
శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తులు.. గొంతులోని కండరాలు చురుకుగా మారతాయి. ఇది స్లీప్ అప్నియా లక్షణాలను తగ్గిస్తుంది. శంఖం ఊదేటప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శంఖం ఊదడానికి ఎక్కువ ఒత్తిడి అవసరం కాబట్టి గొంతు, నాలుక కండరాలు బలోపేతం అవుతాయి. దీనివల్ల నిద్రలో శ్వాస మార్గాలు మూసుకుపోవడం తగ్గుతుంది. అలాగే శంఖం నుంచి వచ్చే ప్రకంపనలు కండరాలను ఉత్తేజపరిచి.. శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తాయి. ఈ కొత్త పరిశోధన స్లీప్ అప్నియా రోగులకు ఒక సరికొత్త ఆశను కలిగిస్తోంది. భవిష్యత్తులో ఈ పద్ధతి మరింత ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:జుట్టు అనారోగ్య సమస్యలను గుర్తిస్తుందా..? సేఫ్‌గా ఉండాలంటే నిజాలు ముందుగానే తెలుసుకోండి