/rtv/media/media_files/2025/10/06/healthy-snacks-2025-10-06-06-58-43.jpg)
Healthy snacks
నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్, బిస్కెట్లు, ఇతర స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. అయితే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) వంటి ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరతో కూడిన ఈ ఆహారాలు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. సాయంత్రం టీ సమయాల్లో లేదా స్నేహితులతో గడిపేటప్పుడు మైదా, నూనెతో చేసిన ఆహారాల బదులు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న స్నాక్స్‌ను ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు చిప్స్, అనారోగ్యకరమైన స్నాక్స్‌కు ప్రత్యామ్నాయంగా సిఫార్సు చేసే 8 ఆరోగ్యకరమైన స్నాక్స్‌లు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ స్నాక్స్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన స్నాక్స్..
వేయించిన శనగలు (Roasted Chickpeas): ఇవి అధిక ప్రోటీన్, ఫైబర్‌తో నిండి, నూనె రహితంగా లభిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి, గట్ ఆరోగ్యానికి చాలా మంచివి.
పాప్‌కార్న్: ఇది హోల్-గ్రెయిన్ ఆహారం, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటుంది. అయితే దీనిని వెన్న, కృత్రిమ ఫ్లేవర్స్ లేకుండా వేయించి ఉప్పు వేసి మాత్రమే తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఎండు ఫలాలు (Dried Fruits): బాదం, వాల్‌నట్, జీడిపప్పు వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్‌కు నిలయాలు. ఇవి గుండె, కాలేయం, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఎడమామే (Edamame): లేదా పచ్చి సోయా చిక్కుళ్లు అధిక ప్రోటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన స్నాక్ ఎంపిక.
ఇది కూడా చదవండి: సండే అని చికెన్, మటన్ కుమ్మేస్తున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!
బెర్రీస్‌తో గ్రీక్ యోగర్ట్: ఇది ప్రోబయోటిక్స్, పాలిఫెనాల్స్ కలిగి ఉండి.. గట్, కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది.
వేయించిన విత్తనాలు (Roasted Seeds): గుమ్మడి, సన్‌ఫ్లవర్, చియా లేదా అవిసె గింజల్లో ఒమేగా-3, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి.
హమ్మస్‌తో వెజ్జీ స్టిక్స్: క్యారెట్‌లు, దోసకాయలు, సెలెరీలను హమ్మస్‌తో కలిపి తీసుకోవడం వల్ల రుచితోపాటు ఫైబర్ లభిస్తుంది.
డార్క్ చాక్లెట్: 70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్ పాలిఫెనాల్స్, మెగ్నీషియం కలిగి ఉంటుంది. ఇది తీపి కోరికలను నియంత్రిస్తుంది.
మీరు ఎంచుకునే స్నాక్స్ మీకు మేలు చేయవచ్చు లేదా హాని చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. ఇటువంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో మీ స్నాక్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?