/rtv/media/media_files/2025/10/05/cough-syrup-2025-10-05-13-13-38.jpg)
Cough syrup
పిల్లలకు తరచుగా వచ్చే దగ్గు విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇష్టమొచ్చినట్లు దగ్గు మందులు (Cough Syrup) ఇవ్వడం ప్రమాదకరమని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పెద్దలకు వాడే దగ్గు మందులను చిన్న పిల్లలకు ఇస్తే ప్రాణాంతకం కావచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు మందులు ఇవ్వవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పిల్లల దగ్గుకు మందుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వైద్యుల హెచ్చరిక..
సాధారణంగా పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల కారణంగా వస్తుంది. నవజాత శిశువులు, స్కూలుకు వెళ్లే పిల్లలు సంవత్సరానికి ఆరు నుంచి ఏడు సార్లు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కారణంగా వారికి 2-3 రోజులు జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, నిద్ర లేమి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ జీవులు మీ ఇంటికి ఆనంద దూతలు.. వాటి రాక అదృష్టానికి సంకేతమని తెలుసా..?
అయితే పిల్లల శరీరానికి వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే శక్తి సహజంగానే ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. ఈ సమస్యలు సాధారణంగా ఆరు నుంచి ఏడు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదనీ.. ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఒకవేళ లక్షణాలు తగ్గకుండా కొనసాగితే.. అప్పుడు మాత్రమే వైద్యుడిని సంప్రదించాలని తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. అనవసరంగా దగ్గు మందులు ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మురికి కొలెస్ట్రాల్‌కు తినే అలవాట్లే కారణమా..? బయటకు పంపే కీలక సూచనలు