Banana Hair Pack: అరటిపండుతో జుట్టు మెరిసేలా అవుతుందని తెలుసా!! అదెలానో ఇప్పుడే చదవండి

జుట్టు సహజమైన మెరుపును, బలాన్ని తిరిగి పొందడానికి అరటిపండుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌లు అద్భుతంగా పని చేస్తాయి. జుట్టు సంరక్షణలో భాగంగా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, చిట్కాలు గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Banana Hair Pack

Banana Hair Pack

జుట్టు సంరక్షణ అనేది కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. అది మీ మొత్తం ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల జుట్టు రాలడం, పొడిబారడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. అయితే సరైన సంరక్షణ, సరైన అలవాట్లతో జుట్టు సమస్యలను అధిగమించవచ్చు. జుట్టు రకాన్ని బట్టి షాంపూ, కండీషనర్ ఎంచుకోవడం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, తలకు మసాజ్ చేయడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో  జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు. ధూళి, కాలుష్యం, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల జుట్టు నిస్తేజంగా, పొడిబారిపోతుంది. జుట్టు సహజమైన మెరుపును, బలాన్ని తిరిగి పొందడానికి అరటిపండుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌లు అద్భుతంగా పని చేస్తాయి. ఈ హెయిర్ మాస్క్‌లు ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. జుట్టు సంరక్షణలో భాగంగా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, చిట్కాలు గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బనానా హెయిర్ ప్యాక్‌లు:

అరటిపండు-పెరుగు: పొడి, గజిబిజిగా ఉండే జుట్టుకు ఈ ప్యాక్ ఉత్తమమైనది. అరటిపండులోని తేమ, పెరుగులోని లాక్టిక్ యాసిడ్ జుట్టును మృదువుగా, నునుపుగా మారుస్తాయి.

అరటిపండు- తేనె : తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ మాస్క్ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

అరటిపండు- కొబ్బరి నూనె : కొబ్బరి నూనె జుట్టు మూలాలకు లోతుగా పోషణను అందిస్తుంది. ఈ మిశ్రమం జుట్టును బలంగా చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అరటిపండు- అలోవెరా: అలోవెరాలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు దెబ్బతిన్న జుట్టును సరిచేస్తాయి. ఈ ప్యాక్ జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ ఔషధం శరీర భారాన్ని తగ్గిస్తుంది.. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో అద్భుతం

అరటిపండు- మెంతి: మెంతి చుండ్రు, తల దురదను తగ్గిస్తుంది. నానబెట్టిన మెంతి, అరటిపండుతో తయారు చేసిన ఈ మాస్క్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

అరటిపండు- గుడ్డు: గుడ్డులో అధికంగా ఉండే ప్రోటీన్ దెబ్బతిన్న జుట్టును బాగు చేసి.. బలంగా మారుస్తుంది. ఈ మాస్క్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

అరటిపండు- ఆలివ్ నూనె : ఆలివ్ నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి తలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మిశ్రమం జుట్టుకు సహజమైన కాంతిని మరియు బలాన్ని ఇస్తుంది. జుట్టు రకాన్ని బట్టి ఈ ప్యాక్‌లలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పెర్ఫ్యూమ్ గుబాళింపులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసా!!

Advertisment
తాజా కథనాలు