Cigarette And Tea: టీ తాగుతూ అలా చేసే అలవాటుందా..? అయితే మీకు చావు ఖాయం.. షాకింగ్ న్యూస్!

సిగరెట్, టీ కలిపి తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం వరకు పెరుగుతుంది. టీలోని విషపూరిత పదార్థాలు, సిగరెట్ పొగతో కలిసి క్యాన్సర్‌కు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా ఈ అలవాట్లు సంతానలేమి, జ్ఞాపకశక్తి తగ్గాటానికి దారితీస్తుంది.

New Update
Cigarette  And Tea

Cigarette And Tea

సిగరెట్ పొగాకు నుంచి తయారు చేయబడిన ఒక చిన్న గొట్టం. దీనిని కాల్చడం వల్ల పొగ వస్తుంది. ఇందులో నికోటిన్‌తో సహా అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. సిగరెట్ తాగేవారికి గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే సిగరెట్ తాగనివారికి కూడా ఇతరులు తాగే పొగ వల్లఅనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం ఒక వ్యసనం. దీన్ని మానేయడం చాలా కష్టం. సిగరెట్ తాగడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసినప్పటికీ.. దానికి తోడు టీ తాగే అలవాటు మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సిగరెట్-టీ అలవాటుతో పెను ముప్పు..

ఎక్కువ మందిలో కనిపించే ఈ అలవాటు ఊహించని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అధిక పొగతాగడం ఊపిరితిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను కుచించుకుపోయేలా చేసి రక్తహీనతకు దారితీస్తుంది. సాధారణంగా టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. సిగరెట్‌తో కలిపి తాగడం గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలతో కలిపిన టీ ఇంకా హానికరం. తాజాగా చేసిన సర్వే ప్రకారం.. సిగరెట్, టీ కలిపి తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం వరకు పెంచుతుందని అధ్యయనంలో తేలింది. టీలోని విషపూరిత పదార్థాలు, సిగరెట్ పొగతో కలిసి క్యాన్సర్‌కు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా ఈ అలవాట్లు సంతానలేమి, శ్వాస ఆడకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కడుపులో పుండ్లు, జీర్ణ సమస్యలు, స్ట్రోక్ వంటి అనేక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మనుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచడంలో శిలాజిత్.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

నేటి కాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. టీ ప్రపంచంలో ఎక్కువగా తాగే పానీయాలలో ఒకటి. దీనిని తేయాకు మొక్కల ఆకుల నుంచి తయారు చేస్తారు. టీలో ఉండే కెఫిన్ (caffeine), ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మంచివి. టీ తాగడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా.. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. టీ తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ.. దానిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా టీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు. టీలో ఉండే కెఫీన్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి.. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచవచ్చు. అలాగే అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల తలనొప్పి, మైకం వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. టీని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. ఇది రక్తహీనతకు దారితీయవచ్చు. టీలోని టానిన్‌లు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం.. టీని మితంగా తీసుకోవడం ముఖ్యం. ఈ అలవాటును వెంటనే మానేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బ్రేక్‌ ఫాస్ట్‌లో అన్నం తింటారా..? అయితే ఈ విషయం మీ కోసమే..!

Advertisment
తాజా కథనాలు