/rtv/media/media_files/2025/05/18/iEZSFZ8dRdeLx5Uvhih5.jpg)
Navel
Navel: ప్రాచీన ఆయుర్వేద చికిత్సా విధానాల్లో నాభి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. నాభి శరీరంలోని అనేక ముఖ్యమైన నరాలతో అనుసంధానమై ఉండటంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నాభిలో నూనె రాయడం ఒక సాంప్రదాయ పద్ధతి. ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించగలదని నమ్ముతారు. శరీరానికి తేమను అందించడంలో నూనె కీలక పాత్ర పోషిస్తుంది. అవి ఏంటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో..
అజీర్ణ సమస్యతో బాధపడేవారు నాభిలో ఆముదం నూనె రాయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెను నాభిలో రాయడం ద్వారా మొటిమల సమస్యలు తగ్గుతాయని అనేక మంది చెబుతున్నారు. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. బాదం నూనెను నాభికి రాయడం వల్ల చర్మంపై ముడతలు, సన్నని గీతలు వచ్చే అవకాశాన్ని తగ్గుతాయి. ఇది చర్మానికి తేమను అందించడంతో పాటు వృద్ధాప్య ప్రభావాన్ని ఆలస్యం చేస్తుంది. స్త్రీలు ఎదుర్కొనే కొన్ని శరీర సంబంధిత సమస్యలలో ముఖ్యంగా కండరాల తిమ్మిరి, మెన్స్ట్రువల్ సమస్యలను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: అకాల వర్షాలతో వ్యాధులు వచ్చే ప్రమాదం.. ఈ టిప్స్ అప్రమత్తంగా ఉండండి
నువ్వుల నూనెను నాభిలో రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇది శరీరానికి లోపలి నుంచి ఉష్ణతను అందించి.. నొప్పులను తగ్గిస్తుంది. ఈ ప్రయోజనాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. అనుభవపూర్వకంగా ఇది చాలా మందికి ఉపశమనం కలిగించిందని చెబుతున్నారు. సంతానోత్పత్తి సమస్యలు, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలనుకునేవారు నాభిలో నూనె రాయడం వల్ల లాభం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వేసవి వేడికి అలసిపోయారా? ఈ నీరు తాగితే సమస్యలన్నీ పరార్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)