Sleep: తక్కువ నిద్రపోయే అలవాటు ఉందా..? ఈ వ్యాధులు శరీరంలోకి వచ్చినట్లే.!!

నిద్రపోతున్నప్పుడు శరీరం మరమ్మత్తు, కోలుకోవడానికి పని చేస్తుంది. రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు, కండరాలు, హార్మోన్లు సమతుల్యతలోకి వస్తాయి. తక్కువ నిద్రపోయే వారిలో హై బీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక బరువు పెరగటం, నిరాశ- ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.

New Update
Sleep

Sleep

Sleep: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వాడకాలు ఎక్కువగా పెరిగాయి. ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉన్నా అర్థరాత్రి వరకు మొబైల్, కంప్యూటర్లు వాడుతూ ఉంటారు. పని ఒత్తిడి, సోషల్ మీడియాలే ఒత్తిడికి ఎక్కువగా కారణం అవుతున్నాయి. ఇవన్నీ నిద్రకు అతిపెద్ద శత్రువులు అవుతున్నాయి. కానీ నిద్ర లేకపోతే అలసటతోపాటు శరీరంపై అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రోజూలో తగినంత నిద్రలేని వారికి గుండెపోటు, మధుమేహం, ఊబకాయం, మానసిక వ్యాధులు అధిక రెట్లు పెరుగుతున్నాయని నిపుణులు పరిశోధనలో తేలింది. నిద్ర లేకపోతే ఎందుకు వ్యాధులు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నిద్ర వల్ల ప్రయోజనాలు:

ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నప్పుడు శరీరం మరమ్మత్తు, కోలుకోవడానికి పని చేస్తుంది. మెదడు రోజు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది, కండరాలు విశ్రాంతి పొందుతాయి, హార్మోన్లు సమతుల్యతలోకి వస్తాయి. నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ వయోజనుడు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు.

హైబీపీ: తక్కువ నిద్రపోతే రక్తపోటు పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

గుండె జబ్బులు: తక్కువ నిద్రపోయేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉందట. అందుకని మంచి నిద్ర కనీస 8 గంటలు అయినా పడుకోవాలి.

డయాబెటిస్: నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది.

అధిక బరువు: నిద్ర లేమి ఆకలి హార్మోన్లలో మార్పులు వస్తాయి. నిద్ర మరింత చురుగ్గా చేసి బరువు పెరగడా చేస్తుంది.

నిరాశ- ఆందోళన: నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఆరోగ్య నిపుణుల పరిశోధన ప్రకారం.. పెద్దలు7-8 గంటలు, పిల్లలు 9-12 గంటలు, టీనేజర్లు 8-10 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. లేకుంటే అనేక సమస్యలు వారికి వస్తాయని హెచ్చరిస్తున్నారు.  అంతేకాకుండా తగినంత నిద్రపోకపోతే.. జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడి ఏ పనిపై దృష్టి పెట్టలేరని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!

ఈ చిట్కాలతో మంచి నిద్ర:

ముందు పడుకోవడానికి, మేల్కొనడానికి సరైనా టైంపై నిర్ణయం తీసుకోవాలి. పడుకోవాటానికి గంట ముందు మొబైల్, టీవీకి దూరంగా ఉండాలి. గది వాతావరణాన్ని ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఫ్లాన్‌ చేసుకోవాలి. సాయంత్రం సమయంలో కెఫిన్, ధూమపానం వంటి వాటికి దూంగా ఉండాలి. నిద్ర అనేది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. దానివల్ల మనస్సు, ఆరోగ్యం రెండిటికి మేలు జరుగుతుంది. నేటి కాలంలో మంచి నిద్ర లేకపోతే తీవ్రమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి మంచి ఆహారాలు తీసుకుంటు, యోగా, వ్యాయమాలు చేస్తూ సమయానికి నిద్రపోతే మంచి నిద్ర పొందుతారు. ఆరోగ్యకరమైన జీవితానికి ఈ అలావట్లు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వ్యాయామంతో మానసిక ఆరోగ్యం మెరుగు.. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..?

( Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News) 

Advertisment
తాజా కథనాలు