/rtv/media/media_files/2025/07/30/exercise-2025-07-30-13-31-57.jpg)
Benefits of Exercise
నేటి కాలంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ద తీసుకుంటున్నారు. శరీరం ఫిట్‌గా ఉండాలని జిమ్‌కి వెళ్తున్నారు. మరి కొందరూ అయితే వ్యాయాలు ఇంట్లోనే చేస్తారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేస్తారు. ఇది మనసుకు, మానసిక ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని బలోపేతం చేసి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గి మనస్సును చురుగ్గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంపై ఎక్కువ శ్రద్ద తీసుకునేవారు.. కొన్ని వ్యాయామాలు గురించి తెలుసుకోవాలి. ఈ వ్యాయాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడు..
వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనిని హ్యాపీ హార్మోన్ అంటారు. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వ్యాయామం మెదడులో రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. ఇది దృష్టి, జ్ఞాపకశక్తికి మేలు చేస్తుంది. రోజూ వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఆందోళన లక్షణాలు తక్కువగా ఉంటాయని అనేక పరిశోధనలో తేలింది. చురుకైన నడక, జాగింగ్, యోగా, నృత్యం వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజుకు కేవలం 30 నిమిషాల వ్యాయామం చేస్తే మానసిక స్థితి మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో నిద్ర సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటి వారు వ్యాయామం చేస్తే ఈ సమస్యకు సులభంగా తగ్గుతుంది. శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడు.. రాత్రి గాఢంగా నిద్ర పడుతుంది. మంచి నిద్ర మెదడు, భావోద్వేగ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
ఇది కూడా చదవండి:బ్లడ్ గ్రూప్‌కు తెలివితేటల మధ్య సంబంధం ఉందా..?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారానికి కనీసం 150 నిమిషాలపైన వ్యాయామం, 75 నిమిషాల అధిక తీవ్రత వ్యాయామం చేయాలంటున్నారు. రోజూ అరగంట వ్యాయామం చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాయామాలు నడక, జాగింగ్ సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం. యోగా, ధ్యానం మానసిక ప్రశాంతత, ఏకాగ్రతకు ఉత్తమమైనదిగా చెబుతారు. నృత్యం, సైక్లింగ్.. సరదాగా చురుగ్గా ఉండటానికి మేలు చేతాయి. జిమ్,శక్తి శిక్షణ.. శరీరం, మనస్సు రెండింటికీ ప్రయోజనకరంగా పని చేస్తుంది. వ్యాయామం శరీరాన్ని, మనస్సు, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది ఒత్తిడి, మానసిక స్థితి, నిద్ర, నిరాశ, ఆందోళన ప్రమాదాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వ్యాయామానికి సమయం కేటాయించాలి. ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు రెండూ నేటి జీవనశైలి ముఖ్యమైనవని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే
latest-telugu-news | healthy life style | Benefits of Exercise