/rtv/media/media_files/2025/10/10/head-shave-2025-10-10-13-02-37.jpg)
head shaving
హిందూ సంస్కృతిలో శిరోముండనం (జుట్టు తీయించే) కార్యక్రమానికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా రెండు లేదా మూడేళ్ల వయసులో ఈ వేడుకను నిర్వహించి, బంధువులకు విందు ఇస్తారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు మొక్కు తీరినా కూడా జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుందనే నమ్మకంతో తమ పిల్లలకు పదేపదే గుండు చేయిస్తుంటారు. ముఖ్యంగా బాలికలకు కూడా రెండు మూడు సార్లు గుండు చేయించడం సర్వసాధారణం. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శాస్త్రీయ ఆధారం లేదు..
చిన్ననాటి నుంచి మనం వింటున్న ఈ నమ్మకానికి శాస్త్రీయ ఆధారం లేదని చర్మ (Dermatologists), హెయిర్ కేర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పదేపదే గుండు చేయిస్తే జుట్టు పెరుగుదల మెరుగుపడుతుందనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని వారు చెబుతున్నారు. జుట్టు పెరుగుదలకు మూలకారణం జుట్టు కుదుళ్లు (Hair Follicles), ఇవి తల చర్మంలోపల ఉంటాయి. గుండు చేసినప్పుడు జుట్టు యొక్క పై భాగం మాత్రమే తొలగించబడుతుంది. తల చర్మంలోని కుదుళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. అందుకే షేవింగ్ జుట్టు పెరుగుదల రేటును లేదా దాని ఆకృతిని ప్రభావితం చేయదు.
ఇది కూడా చదవండి: దీపావళికి ఫిట్‌గా కనిపించాలంటే... తక్కువ రోజుల్లో 2-4 కేజీల బరువుని ఇలా తగ్గించుకోండి!!
చిన్నపిల్లల జుట్టు చాలా మెత్తగా ఉంటుంది. దానిని తీసివేసిన తర్వాత కొత్తగా మొలకెత్తే జుట్టు చివర్లు మొద్దుబారినట్లు (Coarser) ఉంటాయి. ఇది తాకినప్పుడు లేదా చూసినప్పుడు గట్టిగా/ఒత్తుగా అనిపిస్తుంది. ఈ కారణంగానే జుట్టు పెరుగుదల, నాణ్యత మెరుగుపడిందని ప్రజలు నమ్ముతారు. జుట్టు ఎంత ఒత్తుగా, ఏ ఆకృతిలో ఉండాలనేది పూర్తిగా వారసత్వం (Genetics)పై ఆధారపడి ఉంటుంది. అంటే పిల్లల జుట్టు సాధారణంగా తల్లిదండ్రుల జుట్టును పోలి ఉంటుంది. ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే.. పదేపదే గుండు చేయించడం కాకుండా.. సరైన పోషకాలు అందించే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి బిడ్డకు తరచుగా గుండు చేయించాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా..? ఆరోగ్యం కోసం అద్భుతమైన కూరగాయలను డైట్ చేర్చుకోండి