Weight Loss: దీపావళికి ఫిట్‌గా కనిపించాలంటే... తక్కువ రోజుల్లో 2-4 కేజీల బరువుని ఇలా తగ్గించుకోండి!!

ఆహారపు అలవాట్లు, భోజన సమయాలు, వ్యాయామంలో మార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సాధ్యం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తీపి పదార్థాలు, శీతల పానీయాలు, బేకరీ వస్తువులను తగ్గించాలి. సోయా, శనగలు వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

New Update
Weight Loss_

Weight Loss:

దీపావళి పండుగ కేవలం 10 రోజులే ఉంది. ఈ పర్వదినాన సాంప్రదాయ దుస్తుల్లో నాజూకుగా, ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కేవలం పది రోజుల్లో బరువు తగ్గడం కష్టమే అయినా, సరైన ప్రణాళికతో అసాధ్యం కాదు. ఆహారపు అలవాట్లు, భోజన సమయాలు, వ్యాయామంలో మార్పులు చేసుకుంటే మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. అయితే బరువు తగ్గటానికి మార్గదర్శకాలు, ఏదైనా ఆహార ప్రణాళికను, వ్యాయామ దినచర్యను ప్రారంభించే ముందు ధృవీకరించబడిన శిక్షకుడిని (certified coach) సంప్రదించడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరిపోయే క్యాలరీల, వ్యాయామ ప్రణాళిక గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

తక్కువ టైంలో బరువుకు చెక్..

బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తీపి పదార్థాలు, శీతల పానీయాలు, బేకరీ వస్తువులను తగ్గించాలి. వీటిలో ఉండే చక్కెర, శుద్ధి చేసిన పిండి బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదిస్తాయి. పప్పులు, పనీర్, గుడ్లు, పెరుగు, సోయా, శనగలు వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కడుపు నిండుగా ఉంచి.. త్వరగా ఆకలిని తగ్గిస్తాయి. ఫైబర్, కేలరీల నియంత్రణ కోసం సలాడ్లు, ఆకుకూరలు, ఓట్స్, పౌండేజ్ వంటి ఆహారాన్ని చేర్చుకోవాలి. ఉదయం నిమ్మరసంతో కలిపిన గోరు వెచ్చని నీళ్లు తాగడం వలన జీవక్రియ (metabolism) మెరుగుపడుతుంది. అల్పాహారం (breakfast) తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి భోజనాన్ని తేలికగా చేసి రాత్రి 7-8 గంటల లోపే తినాలి. తరచుగా చిరుతిళ్లు తినడం మానుకుని.. రోజుకు 3-4 చిన్న భోజనాలు చేయాలి. కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయవచ్చు.

ఇది కూడా చదవండి: దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..? 20, 21 తేదీల్లో ఏది కరెక్టో తెలుసా..?

జిమ్‌కి వెళ్లలేని వారు కనీసం 30–40 నిమిషాల చురుకైన నడక, యోగా లేదా కార్డియో చేయాలి. దీంతోపాటు 20 నిమిషాల పాటు స్క్వాట్స్, బర్పీలు, పుష్-అప్‌లు, జంపింగ్ జాక్స్ వంటి HIIT (హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) వ్యాయామాలను చేర్చాలి. జిమ్‌కు వెళ్లేవారు 45–60 నిమిషాల మధ్యస్త (moderate) తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలి. త్వరగా ఫలితాలు రావాలని అతిగా శ్రమించకూడదు. లేదంటే శరీరం కోలుకోవడం కష్టమై ఫలితాలు ఆలస్యం అవుతాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి,  కడుపు నిండుగా అనిపించడానికి రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. కనీసం 7-8 గంటల నిద్ర వలన శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడి (stress) వలన కార్టిసాల్ పెరిగి, పొట్ట కొవ్వు తగ్గకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవాలి.  ఈ నియమాలను 10 రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే సులభంగా 2-4 కిలోల బరువు తగ్గవచ్చు. అయితే బరువు తగ్గే మొత్తం వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది కాబట్టి ఇతరులతో పోల్చుకోకూడదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: ఎముకలతోపాటు ఆరోగ్యానికి విటమిన్ D లోపం పరార్.. ఆశ్చర్యకరమైన లాభాలను తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు